KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

కేజీయఫ్2.. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ కన్నడ మూవీ.. సారీ.. పాన్ ఇండియా మూవీ.. సినీ ప్రేమికులను థియేటర్ల....

KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

Kgf 2 First Weekend Collections

KGF2: కేజీయఫ్2.. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ కన్నడ మూవీ.. సారీ.. పాన్ ఇండియా మూవీ.. సినీ ప్రేమికులను థియేటర్ల వద్ద బారులు తీరేలా చేస్తోంది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ మరోసారి తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

KGF2: మూడు రోజుల్లో కేజీయఫ్2 సెన్సేషన్!

ఇక ఈ సినిమాకు కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తన పేరిట రాసుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతుండటంతో అక్కడ ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే కేజీయఫ్ సినిమా నార్త్ ఇండియాలో తొలిరోజు ఆల్‌టైమ్ రికార్డు కలెక్షన్లతో తన సత్తా చాటగా.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా వారెవ్వా అనిపించింది.

KGF2: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కేజీయఫ్2 వసూళ్లు

ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.277.81 కోట్ల షేర్ వసూళ్లు సాధించగా.. గ్రాస్ పరంగా రూ.552 కోట్లు సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడుతున్నారు. కాగా ఈ ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.28.17 కోట్లు
సీడెడ్ – రూ.7.43 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.4.82 కోట్లు
ఈస్ట్ – రూ.3.56 కోట్లు
వెస్ట్ – రూ.2.20 కోట్లు
గుంటూరు – రూ.2.97 కోట్లు
కృష్ణా – రూ.2.66 కోట్లు
నెల్లూరు – రూ.1.75 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.53.56 కోట్లు(షేర్) (రూ.84.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.53.40 కోట్లు
తమిళనాడు – రూ.15.20కోట్లు
కేరళ – రూ.12.05 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా – రూ.96.70 కోట్లు
ఓవర్సీస్ – రూ.46.90 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.277.81 (షేర్) (రూ.546 కోట్లు గ్రాస్)