KGF2: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కేజీయఫ్2 వసూళ్లు

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా కోసం యావత్ సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ వచ్చారు...

KGF2: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కేజీయఫ్2 వసూళ్లు

Kgf2 Ap Ts Day 1 Collections

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా కోసం యావత్ సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమా తొలి ఆటకే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా అదరగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేశాయి.

KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. మాస్ మ్యాడ్‌నెస్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ పర్ఫార్మెన్స్‌కు వారు ఫిదా అవుతున్నారు. కాగా హీరో ఎలివేషన్స్ మొదలుకొని, బీజీఎం వరకు ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు బోలెడు ఉండటంతో వారు ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది.

KGF2: రాఖీ భాయ్ దెబ్బకు ‘బీస్ట్’ ఖతం..?

ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు తొలి రోజున రూ.19.51 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓ డబ్బింగ్ సినిమాకు తొలి రోజున ఈ స్థాయిలో షేర్ వసూళ్లు రావడంతో.. కేజీయఫ్ 2 చిత్రం ఇతర సినిమాలను ఓవర్‌టేక్ చేసి టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.112 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేయడంతో, ఈ మార్క్‌ను కేజీయఫ్ 2 ఖచ్చితంగా అందుకుంటుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కాగా ఏరియాల వారీగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 9.60 కోట్లు
సీడెడ్ – 2.80 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.70 కోట్లు
గుంటూరు – 2 కోట్లు
ఈస్ట్ – 1.17 కోట్లు
వెస్ట్ – 0.84 కోట్లు
కృష్ణా – 0.90 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.19.51 కోట్లు