KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

కేజీయఫ్ 2... ప్రపంచవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా మేనియాతో ఊగిపోతున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు....

KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

Kgf 2 First Day Hindi Collections Expected To Be Rs 38 Cr

KGF2: కేజీయఫ్ 2… ప్రపంచవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా మేనియాతో ఊగిపోతున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేజీయఫ్ చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా-లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

KGF2: రాఖీ భాయ్‌పై భారీ అంచనాలు.. ఏం జరగబోతుంది?

ఇక ఈ సినిమాకు వస్తున్న మాసివ్ రెస్పాన్స్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ముఖ్యంగా కేజీయఫ్ 2కు హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా హిందీ భాషలో తొలిరోజే కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడో దాటేసిన కేజీయఫ్, తొలిరోజు వసూళ్లతో హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?

కేజీయఫ్ 2 ఓపెనింగ్ రోజున ఏకంగా రూ.38-39 కోట్ల మేర వసూళ్లు రాబడుతుందని హిందీ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రేంజ్‌లో బాలీవుడ్‌లో ఇప్పటివరకు తొలిరోజు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఏ సినిమా కూడా లేకపోవడంతో, బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్ అని అంటున్నారు కేజీయఫ్ అభిమానులు. ఇక ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మేరకు బాలీవుడ్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో కేజీయఫ్ 2 చిత్రానికి టాప్ ప్లేస్‌లో స్థానం ఇచ్చాడు. ఇక రెండో ప్లేస్‌లో బాహుబలి 2 చిత్రం నిలిచినట్లు ఆయన లెక్కలతో సహా పేర్కొన్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.