KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?

ప్రశాంత్ నీల్ దెబ్బకు రాజమౌళి తట్టాబుట్టా సర్ధుకోవాల్సిందినా..? కేజీఎఫ్ రిలీజ్ అయితే ట్రిపుల్ ఆర్ ఫైనల్ రన్ కు చేరుకున్నట్టేనా..? ఇప్పుడివే ప్రశ్నలు టాలీవుడ్ ఇండస్ట్రీని..

KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?

Kgf2

KGF2: ప్రశాంత్ నీల్ దెబ్బకు రాజమౌళి తట్టాబుట్టా సర్ధుకోవాల్సిందినా..? కేజీఎఫ్ రిలీజ్ అయితే ట్రిపుల్ ఆర్ ఫైనల్ రన్ కు చేరుకున్నట్టేనా..? ఇప్పుడివే ప్రశ్నలు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అదే నిజమైతే జక్కన్న కల.. కలగానే మిగిలిపోతుంది. ఏదేతైనేం శాండల్ వుడ్ స్టాండర్డ్స్ అమాంతం పెంచేసిన కేజీఎఫ్.. అడ్వాన్స్ బుకింగ్ తోనే ట్రిపుల్ ఆర్ కి చెక్ పెట్టేస్తోంది.

KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!

యశ్ మాటలు వింటుంటే రికార్డ్స్ పక్కా అన్న హోప్ కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ ను బీట్ చేసే సంగతి అటుంచితే ముందు కేజీఎఫ్ చాప్టర్ 2 రాకతో ఆ మూవీ లాంగ్ రన్ కి బ్రేక్ పడినట్టే. సౌత్ టు నార్త్ యశ్ మేనియా చూస్తుంటే.. జక్కన్న సినిమా కలెక్షన్స్ కి గండి పడిందనేది స్పష్టంగా తెలుస్తోంది. అటు బీస్ట్ రాకతో తమిళ్ ఆడియెన్స్ కూడా ట్రిపుల్ ఆర్ ని ఇకపై కన్సిడర్ చేసే అవకాశాలు తక్కువే. తెలుగు రాష్ట్రాల్లోనూ రాకింగ్ స్టార్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడా ట్రిపుల్ ఆర్ ఛార్మ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువే.

KGF2: యష్ పాన్ ఇండియా ప్రమోషన్.. తెలుగుపై స్పెషల్ టార్గెట్!

1000 కోట్లు అయితే సంపాదించింది ట్రిపుల్ ఆర్. కానీ ఎటొచ్చి రాజమౌళి రెండు కోరికలను తీర్చలేకపోతుంది. ఒకటి బాహుబలి2 కలెక్షన్స్ ను క్రాస్ చేయడం.. రెండోది 2వేల కోట్లను రాబట్టడం. పెట్టిన పెట్టుబడికి గట్టి రాబడినే దక్కించుకున్న రామ్, భీమ్.. జక్కన్న కలను మాత్రం నెరవేర్చలేకపోతున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే మాటలూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేజీఎఫ్, బీస్ట్ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా ఆర్ఆర్ఆర్ మళ్లీ ఊపందుకుంటుందనే ఆశలూ కొందరిలో ఉన్నాయి.

KGF2: కేజీఎఫ్ 2 వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

ఏదేమైనా తెలుగు ఆడియెన్స్ పై బాగా నమ్మకం పెట్టుకున్నాడు రాకింగ్ స్టార్. నార్త్ ఆడియెన్స్.. అడ్వాన్స్ బుకింగ్ తోనే జోష్ చూపిస్తున్నారు. కన్నడవారు ఎలాగూ కేజీఎఫ్ కు అండగానే ఉంటారు. రీసెంట్ గా మొదలైన తెలంగాణ, ఆంధ్ర ప్రీ బుకింగ్ సేల్స్ కూడా సాలిడ్ రిజల్ట్స్ నే చూపిస్తున్నాయి. ఓవర్సీస్ లో యశ్ క్రేజ్ హై రేంజ్ లోనే ఉంది. సో చాప్టర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయనే అంచనాలున్నాయి. గతంలో ఏ డబ్బింగ్ మూవీకి జరుగని ప్రీ రిలీజ్ బిజినెస్ యశ్-ప్రశాంత్ నీల్ కాంబో సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ కలిపి 78కోట్ల బిజినెస్ చేసింది. మరి కేజీఎఫ్ చాప్టర్ 2 డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.