KGF2: యష్ పాన్ ఇండియా ప్రమోషన్.. తెలుగుపై స్పెషల్ టార్గెట్!

తెలుగు ఆడియెన్స్ ను కాకా పట్టే పనిలో ఉన్నాడు రాకింగ్ స్టార్. నార్త్ లో చకచకా ప్రమోషన్స్ కానిచ్చారు. చెన్నై, కొచ్చి, బెంగుళూర్ లను చుట్టేశారు. కానీ తెలుగు రాష్ట్రాలపై మాత్రం..

KGF2: యష్ పాన్ ఇండియా ప్రమోషన్.. తెలుగుపై స్పెషల్ టార్గెట్!

Kgf2

KGF2: తెలుగు ఆడియెన్స్ ను కాకా పట్టే పనిలో ఉన్నాడు రాకింగ్ స్టార్. నార్త్ లో చకచకా ప్రమోషన్స్ కానిచ్చారు. చెన్నై, కొచ్చి, బెంగుళూర్ లను చుట్టేశారు. కానీ తెలుగు రాష్ట్రాలపై మాత్రం స్పెషల్ ఫోకస్ చేశారు కేజీఎఫ్ మేకర్స్. ఆంధ్ర, తెలంగాణకు ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రెడీ చేసి పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటే ప్రమోషన్స్ రేంజ్ చూపిస్తున్నాడు యశ్.

KGF2: ఆయన పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

తెలుగువారిని ఆకట్టుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో యశ్. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగళూర్ సిటీస్ లో క్రేజ్ చూపించిన రాకింగ్ స్టార్.. ఇప్పుడు ఆంధ్ర – తెలంగాణ టూర్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇంప్రెజ్ చేయడానికి కాదంటూనే తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తున్నాడు కేజీఎఫ్ హీరో. తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో భాగంగా ముందు తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించి.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంది కేజీఎఫ్ టీమ్.

KGF2: కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్!

తిరుమల నుంచి సింహాచలం చేరుకుని వరాహలక్ష్మీ నృసింహుని ఆశీస్సులు అందుకున్నారు. ఆపై వైజాగ్ బీచ్ రోడ్ లో ఆడియెన్స్ తో మాట్లాడి యశ్ టీమ్ సందడి చేసింది. వైజాగ్ నుంచి నేరుగా హైదరాబాద్ రీచై ఇక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్ తో కేజీఎఫ్ తెలుగు ప్రమోషన్ టార్గెట్ పూర్తి చేశారు. టాలీవుడ్ లో ఇంత బజ్ ఇవ్వడానికి కారణం.. ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉండటమే. తెలుగు ఆడియెన్స్ థియేటర్స్ కి కదిలారంటే.. హ్యూజ్ ఓపెనింగ్స్ దక్కించుకోవడం తేలిక. సో అంచనాలు ఉన్నా సరే బజ్ డబుల్ చేసేందుకు కేజీఎఫ్ మేకర్స్.. ఈ టూర్ ను వర్కవుట్ చేశారు. సాలిడ్ ప్రమోషన్స్ తో యశ్ సైతం వావ్ అనిపించుకున్నాడు.