KGF2: రాఖీ భాయ్ దెబ్బకు ‘బీస్ట్’ ఖతం..?

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీయఫ్ 2’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకించి.....

KGF2: రాఖీ భాయ్ దెబ్బకు ‘బీస్ట్’ ఖతం..?

Kgf2 Overtakes Beast All Over India Except Tn

KGF2: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీయఫ్ 2’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్ మూవీగా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వస్తుండటంతో కేజీయఫ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే నిన్న(బుధవారం) రిలీజ్ అయిన తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ చిత్రాన్ని పూర్తిగా ఓవర్‌టేక్ చేసింది కేజీయఫ్ చాప్టర్ 2.

KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఒక రోజు తరువాత రిలీజ్ అవుతున్న కేజీయఫ్-2తో బీస్ట్ సినిమా గట్టి పోటిపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ బీస్ట్ చిత్రానికి తొలిరోజే డివైడ్ టాక్ రావడం.. కేజీయఫ్2కు అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో ఆడియెన్స్ ఇప్పుడు కేజీయఫ్2పై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాలోని హీరో ఎలివేషన్స్ హైలైట్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించాడని తెలుసుకున్న సినిమా లవర్స్, బీస్ట్‌ను కాదని కేజీయఫ్ కోసం వెళ్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బీస్ట్ చిత్రాన్ని కేజీయఫ్ ఓవర్‌టేక్ చేసినట్లు అయ్యింది.

Beast: పాన్ ఇండియా రిలీజ్.. కానీ పబ్లిసిటీని లైట్ తీసుకున్న విజయ్?

అయితే తమిళనాడులో మాత్రం ఈ వారాంతం వరకు బీస్ట్ హవా కొనసాగనుంది. ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న తమిళ నాట.. విజయ్ అంటే ప్రాణం ఇస్తారు అభిమానులు. అలాంటిది.. కన్నడ డబ్బింగ్ సినిమా కోసం బీస్ట్ చిత్రానికి అక్కడి వారు అన్యాయం చేయరని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రెండు భారీ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయితే, ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో బీస్ట్, కేజీయఫ్2 సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయి. ఏదేమైనా రాఖీ భాయ్ చేతిలో బీస్ట్ ఖతం అయ్యిందనే అంటున్నారు కన్నడ అభిమానులు. మరి దేశవ్యాప్తంగా ఇదే ప్రభావం ఉంటుందా అనేది కేజీయఫ్2 తొలిరోజు వసూళ్లను బట్టి ఓ క్లారిటీ వస్తుందని ప్రేక్షకులు అంటున్నారు.