Beast: పాన్ ఇండియా రిలీజ్.. కానీ పబ్లిసిటీని లైట్ తీసుకున్న విజయ్?

తెలుగు రాష్ట్రాలనే మెయన్ టార్గెట్ చేసి యశ్ జోరు చూపిస్తుంటే.. తమిళ్ సూపర్ స్టార్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఇక్కడి కొచ్చి ప్రచారం చేసేందుకు ఇష్టపడట్లేదు. పాన్ ఇండియా వైడ్..

Beast: పాన్ ఇండియా రిలీజ్.. కానీ పబ్లిసిటీని లైట్ తీసుకున్న విజయ్?

Beast

Beast: తెలుగు రాష్ట్రాలనే మెయన్ టార్గెట్ చేసి యశ్ జోరు చూపిస్తుంటే.. తమిళ్ సూపర్ స్టార్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఇక్కడి కొచ్చి ప్రచారం చేసేందుకు ఇష్టపడట్లేదు. పాన్ ఇండియా వైడ్ వాళ్ల సినిమా థియేటర్స్ కొస్తున్నా వాళ్లు మాత్రం చెన్నై దాటి కదిలేలా లేరు. ఎందుకు కోలీవుడ్ స్టార్స్ పబ్లిసిటీని లైట్ తీసుకుంటున్నారు.. తమిళ్ ఆడియెన్స్ ఆదరిస్తే చాలు అనుకుంటున్నారా..?

Beast : జోరుగా హుషారుగా.. కారులో బీస్ట్ ప్రమోషన్స్..

ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది బీస్ట్. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే రిలీజ్ ప్లాన్ చేశారు. పోటీకి KGF2 ఉన్నా సరే దిల్ రాజు సపోర్ట్ తో 10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ తో బీస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దళపతి విజయ్ డుమ్మా కొట్టాడు. మిగిలిన కాస్ట్ అంతా అటెండ్ అయినా అసలైన బీస్ట్ స్టార్ మాత్రం కనిపించలేదు. గతంలో కూడా ఇంతే.. మాస్టర్, విజిల్, అదిరింది సినిమా ప్రచారాలకు కూడా విజయ్ ఇక్కడికి వచ్చిన దాఖలాలే లేవు.

KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

అజిత్ కూడా అంతే. వలిమై షూటింగ్ హైదరాబాద్ లో జరిగినా.. రిలీజ్ టైమ్ లో మాత్రం ఇక్కడి వారిని పలకరించలేదు. కోలీవుడ్ లో వీళ్లు బిగ్ స్టార్ కావొచ్చు.. కానీ తన సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకులు.. పోనీ కనీసం తెలుగు వారు ఆదరించాలి అనుకున్నప్పుడు ఇక్కడికొచ్చి ప్రమోట్ చేయడం మినిమం కర్టసీ. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ కూడా వాళ్ల సినిమా ఈవెంట్స్ ను ఎప్పుడూ మిస్ కారు. సూర్య, విక్రమ్ లాంటి వాళ్లు కూడా రిలీజ్ టైమ్ లో హైదరాబాద్ చుట్టేస్తారు. కానీ విజయ్, అజిత్ ససేమిరా అంటారు. అంతేనా పాటల డబ్బింగ్ నుంచి టైటిల్ పెట్టడం దాకా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చాలా లైట్ తీసుకుంటున్నారు ఈ హీరోలు.