Beast : జోరుగా హుషారుగా.. కారులో బీస్ట్ ప్రమోషన్స్..

తాజాగా 'బీస్ట్' యూనిట్ సరికొత్త ప్రమోషన్స్ కి తెరతీసింది. ఓ ప్రెస్ మీట్ కి చిత్ర యూనిట్ అంతా విజయ్ కార్ లో సరదాగా వెళ్లారు. ఓ ఫన్ రైడ్ లా దీనిని నిర్వహించారు. విజయ్ సొంత కార్లో....

Beast : జోరుగా హుషారుగా.. కారులో బీస్ట్ ప్రమోషన్స్..

Beast

Beast :  విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఈ వారం ఏప్రిల్ 13న రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. యువ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సాధారణంగా విజయ్ తన సినిమాలకు ప్రమోషన్స్ లో ఎక్కువగా కనపడడు. ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే హాజరవుతారు. మిగతా ప్రమోషన్స్ అన్ని చిత్ర యూనిట్ చేసుకుంటుంది. కానీ ఈ సారి ‘బీస్ట్’ సినిమాకి ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. విజయ్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

 

ప్రస్తుతం అందరు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ విజయ్ కి తెలుగు, మలయాళం లో మార్కెట్ ఉంది. హిందీ, కన్నడలో హీరోగా తెలుసు. దీంతో విజయ్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక ‘బీస్ట్’ సినిమాతో పోటీగా ‘కేజిఎఫ్’ కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో ‘బీస్ట్’ బలంగానే ఉన్నా మిగిలిన రాష్ట్రాల్లో ‘బీస్ట్’ సినిమాకి అంతగా రెస్పాన్స్ రావట్లేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా ‘కేజిఎఫ్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో వేరే రాష్ట్రాల్లో ‘బీస్ట్’కి ‘కేజిఎఫ్’ వల్ల ఆదరణ తగ్గేలా ఉంది. అంతే కాక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం చేసిన ప్రమోషన్స్ చూసి అప్పట్నుంచి అందరూ ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు. దీంతో విజయ్ ఈ సారి ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాని మరింత ప్రమోట్ చేయాలని భావించినట్లు తెలుస్తుంది. అందుకే కొత్త కొత్త ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Ramayanam : 25 సంవత్సరాల రామాయణం.. బాల నటుడిగా తారకరాముని ప్రభంజనం..

తాజాగా ‘బీస్ట్’ యూనిట్ సరికొత్త ప్రమోషన్స్ కి తెరతీసింది. ఓ ప్రెస్ మీట్ కి చిత్ర యూనిట్ అంతా విజయ్ కార్ లో సరదాగా వెళ్లారు. ఓ ఫన్ రైడ్ లా దీనిని నిర్వహించారు. విజయ్ సొంత కార్లో విజయ్ డ్రైవ్ చేస్తుండగా కార్ లో పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్‌, డాన్స్ మాస్టర్‌ సతీష్‌, నటి అపర్ణ దాస్‌, సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస ఉన్నారు. వీరంతా జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ సరదాగా రైడ్ చేశారు. దీన్నంతా వీడియోలు తీసి, వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా కార్లో షికారుకెళ్తున్నట్టు వీడియోలు తీసి బీస్ట్ సినిమాని కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏప్రిల్ 13న రిలీజ్ అవ్వనున్న ‘బీస్ట్’ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.