KGF2-Beast: రాఖీభాయ్ విజయం.. బీస్ట్ దర్శకుడిపై ఆగ్రహం!

ఇంట గెలిచాడు.. రచ్చ గెలిచాడు. రాఖీబాయ్.. పక్క రాష్ట్రాల హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. కేజీఎఫ్2 ఉందని తెలిసీ పోటీకి కాలుదువ్విన విజయ్ ఆశలపై బీస్ట్ నీళ్ల చల్లేసింది.

KGF2-Beast: రాఖీభాయ్ విజయం.. బీస్ట్ దర్శకుడిపై ఆగ్రహం!

Kgf2 Beast

KGF2-Beast: ఇంట గెలిచాడు.. రచ్చ గెలిచాడు. రాఖీబాయ్.. పక్క రాష్ట్రాల హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. కేజీఎఫ్2 ఉందని తెలిసీ పోటీకి కాలుదువ్విన విజయ్ ఆశలపై బీస్ట్ నీళ్ల చల్లేసింది. సొంత రాష్ట్రంలో కూడా బీస్ట్ కు సరైన కలెక్షన్స్ రాకుండా చాప్టర్ 2 అడ్డుకట్ట వేస్తోంది. ఈ పరిస్థితుల్లో బీస్ట్ డైరెక్టర్.. నెల్సన్ దిలీప్ రగిలిపోతుంటే.. ఆ అగ్నికి దళపతి విజయ్ తండ్రి మరింత ఆజ్యం పోసాడు.

KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!

బాక్సాఫీస్ ను కేజీఎఫ్ చాప్టర్ 2 మామూలుగా దున్నేయడం లేదు. కేవలం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 645 కోట్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ లో దాదాపు 240 కోట్లను రాబట్టి.. నార్మల్ డేస్ లో కూడా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడేలా చేస్తోంది. సౌత్ రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇదే. ముఖ్యంగా తమిళనాడులో వాళ్ల ఫేవరేట్ హీరో సినిమాను వదిలేసి మరీ ప్రేక్షకులు యశ్ బాట పడుతున్నారు. సరైన కంటెంట్ లేకుండా బీస్ట్ ను తీసుకొచ్చారనే నెగిటివ్ టాక్ హీరో విజయ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ను నిద్రపోనివ్వట్లేదు.

KGF: Chapter 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో RRR రికార్డులను బ్రేక్ చేసిన యష్..?!

అసలే ఓ పక్క ట్రోలింగ్.. మరో సైడ్ కలెక్షన్స్ రాక నీరసం వస్తుంటే.. దళపతి విజయ్ తండ్రి బీస్ట్ మూవీపై చేసిన కామెంట్స్ నెల్సన్ దిలీప్ కు చిరాకు పుట్టిస్తున్నాయి. కేవలం విజయ్ స్టార్ డం నే నమ్ముకున్న డైరెక్టర్.. కథ, స్క్రీన్ ప్లేపై శ్రద్ధ పెట్టలేదని చంద్రశేఖర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్‌సబ్జెక్ట్‌తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ఉండాలి. అసలు లోతుగా అధ్యయనం చేయకుండానే సినిమాను తీసుకొచ్చాడన్నారు. అటు రజనీ కాంత్ తో ఇప్పటికే నెల్సన్ సినిమా చేజారిపోతుందనే వార్తలొస్తున్నాయి. బట్ అలాంటిదేమి లేదు.. రజనీతో నెల్సన్ సినిమా ఉంటుందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం.