KGF2: కేజీఎఫ్ ప్రకంపనలు.. ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్స్!

బ్రేకుల్లేని బుల్ డోసర్ లా రాకింగ్ స్టార్ దూసుకుపోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. భారీ బడ్జెట్ లెక్కలు లేకుండా..

KGF2: కేజీఎఫ్ ప్రకంపనలు.. ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్స్!

Kgf2

KGF2: బ్రేకుల్లేని బుల్ డోసర్ లా రాకింగ్ స్టార్ దూసుకుపోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. భారీ బడ్జెట్ లెక్కలు లేకుండా.. ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేయకుండా వచ్చి ప్రశాంత్ నీల్ పుట్టిస్తోన్న ప్రకంపనలకి మేకర్స్ కొందరు వణికిపోతున్నారు. అయితే ఇండియన్ బిగ్ స్టార్స్ మాత్రం ప్రశాంత్ నీల్ కి ఒక్క సినిమా అంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్.. నిజంగానే ఓ కన్నడ ఆరిజన్ ఫిల్మ్ ని వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ చేసి పవర్ ఫుల్ టీమ్ అనిపించారు కేజీఎఫ్ మేకర్స్. చాప్టర్ 2 బాక్సాఫీస్ తాండవం చూస్తుంటే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి ప్రశాంత్ నీల్ బొమ్మ కనిపిస్తోంది. ఈ మూవీ కేవలం 4 రోజుల్లో 550 కోట్ల గ్రాస్ సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే 200 కోట్ల రేంజ్ చూపించిందంటే రాఖీభాయ్ కు నార్త్ ఆడియెన్స్ ఎంతలా కనెక్ట్ అయ్యారో తెలుస్తోంది.

KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

బాలీవుడ్ క్రేజీ సినిమాలు, భారీ బిల్డప్ ఇచ్చిన పాన్ ఇండియా సినిమాలు కూడా దక్కించుకోని కలెక్షన్స్ ను ఓ కన్నడ సినిమా రాబడుతోంది. 6 రోజుల్లో బాహుబలి2 బాలీవుడ్ 200 కోట్ల క్లబ్ లో చేరితే.. రీసెంట్ ట్రిపుల్ ఆర్ ఆ క్లబ్ లో చేరడానికి 13 రోజులు పట్టింది. కానీ కేజీఎఫ్ 2 కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో 200 కోట్లను రీచయి బ్లాక్ బాస్టర్ కా బాప్ అనిపించుకుంటోంది. ఇప్పుడొస్తున్న భారీ సినిమాలతో పోల్చుకుంటే తక్కువనిపించే 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఒక్కొక్క మేకర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు కేజీఎఫ్ టీమ్.

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

బాలీవుడ్ లోనే కాదు.. తమిళనాడులో కేజీఎఫ్2 మిడ్ నైట్ స్పెషల్ షోలు పడుతున్నాయి. కేరళలో బాక్సాఫీస్ కింగ్ లా మారాడు రాఖీభాయ్. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 55 కోట్లకు పైమాటే. ఇక కన్నడ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి సూపర్ డూపర్ హిట్ తో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంకేముంది సింపుల్ గా రికార్డులు బద్ధలు కొడుతున్న ప్రశాంత్ నీల్ కోసం స్టార్స్ అందరూ క్యూ కడుతున్నారిప్పుడు.

KGF2: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కేజీయఫ్2 వసూళ్లు

తీసింది మూడే సినిమాలు.. కానీ ఆ మూడో సినిమా కేజీఎఫ్ 2 తాండవానికి బిగ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంతి నీల్ చూపిస్తున్న లెక్కకి మాతో పక్కాగా సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ డబ్బింగ్ సినిమా నార్త్ లో క్రేజ్ చూపిస్తుంటే.. అంతకుమించిన క్రేజ్ మాకూ కావాలని కొందరు బాలీవుడ్ స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇటు సౌత్ స్టార్స్ కూడా ప్రశాంత్ నీల్ లైనప్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్, తారక్, రామ్ చరణ్ తో కమిట్ అయిన ఈ సాలిడ్ డైరెక్టర్ నెక్ట్స్ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.