KGF2: 8 ఏళ్ళ ప్రయాణం.. రాఖీ భాయ్ రికార్డుల వెనక కష్టం తెలుసా?

5 రోజులు.. 500 కోట్లకు పైగా కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ కెజిఎఫ్ 2 గురించే..

KGF2: 8 ఏళ్ళ ప్రయాణం.. రాఖీ భాయ్ రికార్డుల వెనక కష్టం తెలుసా?

Kgf2

KGF2: 5 రోజులు.. 500 కోట్లకు పైగా కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ కెజిఎఫ్ 2 గురించే. అంతకుముందు సౌత్ జనాలే పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలుకొడుతోంది. మూడేళ్ల క్రితమే ఫస్ట్ పార్ట్ రిలీజ్ కోసం షారూఖ్ ఖాన్ తో భయం భయంగా పోటీ పడ్డ కెజిఎఫ్.. ఇప్పుడు అదే బాలీవుడ్ లో రికార్డ్ కా బాప్ అంటూ సక్సెస్ జెండా ఎగరేస్తోంది.

KGF2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా?

ఇలాగే ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం సలామ్ రాఖీ భాయ్ అనే అంటోంది. ఎక్కడ చూసినా ఈ కన్నడ సినిమా గురించే టాక్. ఏ నలుగురు కూర్చున్నా.. యష్ అల్టిమేట్ వన్ మ్యాన్ షో యాక్టింగ్ గురించే టాపిక్. జస్ట్ యాక్టింగ్, మేకింగ్, సినిమా సక్సెస్ గురించే కాదు.. కెజిఎఫ్ రికార్డులు చూసి ఇండియన్ సినిమా మొత్తం ఆశ్చర్యపోతోంది. ఆ రేంజ్ లో రిలీజ్ అయి 5 రోజుల్లో 500 కోట్ల పైగా కలెక్షన్లను దాటి కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ కలెక్షన్ల రికార్డును సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ 8 ఏళ్ల క్రితం అనుకున్న కెజిఎఫ్ స్టోరీ నుంచి కెజిఎఫ్ 2 రిలీజ్ వరకూ చాలా పెద్ద కథే ఉంది.

KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

తూఫాన్ లాంటి సక్సెస్ తో పాటు.. కలెక్షన్ల రికార్డులు కూడా సొంతం చేసుకుంటున్న కెజిఎఫ్ సిరీస్ తెరకెక్కించడానికి చాలాకష్టపడ్డారు టీమ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది కానీ ఈ సక్సెస్ వెనక పెద్ద స్టోరీనే ఉంది. కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ ని ఎన్నో ఆశలతో తెరెకెక్కించినా.. రిలీజ్ కోసం మాత్రం చాలాకష్టాలు పడ్డారు కెజిఎఫ్ టీమ్.

KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

అప్పటి వరకూ జస్ట్ ఓ కన్నడ రీజనల్ హీరోగా ఉన్న యష్.. ఫస్ట్ టైమ్.. పాన్ ఇండియా హీరోగా పవర్ ఫుల్ సబ్జెక్ట్ కెజిఎఫ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యారు. 2018లో కెజిఎఫ్ ఫస్ట్ చాప్టర్ రిలీజ్ కే విపరీతమైన కాంపిటీషన్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. తమిళ్, తెలుగుతో పాటు హిందీలో ఏకంగా షారూఖ్ ఖాన్ తో తలపడాల్సి వచ్చింది కెజిఎఫ్.

KGF2: కేజీఎఫ్ ప్రకంపనలు.. ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్స్!

తమిళ్ లో విజయ్ సేతుపతి సీతకాతి, తెలుగులో వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీస్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ జీరో మూవీ రిలీజ్ కూడా 2018 డిసెంబర్ లోనే రిలీజ్ డిసైడ్ అయ్యాయి. అప్పటికే రిలీజ్ విషయంలో చాలా డేట్స్ చూసిన కెజిఎఫ్ లాస్ట్ కి డిసెంబర్ 21న రిలీజ్ కి ఫిక్స్ అయ్యి ధియేటర్లోకొచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అనౌన్స్ చేసినా కూడా ఈ కన్నడ సినిమా కెజిఎఫ్ ని పెద్దగా పట్టించుకన్న వాళ్లు లేరు. కానీ ఒక్కసారి ధియేటర్లోకొచ్చిన తర్వాత కెజిఎఫ్ తర్వాత మిగిలిన ఏ సినిమా గురించి కూడా మాట్లాడలేనంత బిగ్గెస్ట్ అయ్యి సెన్సేషన్ అయ్యింది కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్.

KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

అప్పటి వరకూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, అక్కడ యష్ అనేహీరో ఉంటాడని కూడా ఏమాత్రం తెలీని బాలీవుడ్ కెజిఎఫ్ రిలీజ్ తో అలర్ట్ అయ్యింది. ఈరేంజ్ ఎలివేషన్, ఈరేంజ్ గ్రాండియర్, ఈ రేంజ్ స్టోరీ టెల్లింగ్ నెవర్ బిఫోర్ అంటూ ఆశ్చర్యపోయింది. అంతేకాదు.. సౌత్ కూడా కెజిఎప్ హిట్ అవ్వడంతో తమ సినిమాల్ని, హీరోల్ని కూడా ఇదే రేంజ్ లో ప్రొజెక్ట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ డే రిలీజ్ అయ్యి 25 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే అదే అప్పటి వరకూ కన్నడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రికార్డ్ ఓపెనింగ్స్. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా 115 కోట్లు కలెక్ట్ చేసి కన్నడ సినిమా చరిత్రలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది కెజిఎఫ్. అప్పటికి యష్ గురించి పెద్దగా తెలీక పోయినా బాలీవుడ్ ఆడియన్స్ కెజిఎఫ్ ని ఆదరించారని, కెజిఎప్ ని సక్సెస్ చేశారని చెబుతూనే ఉంటారు యష్.

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

కెజిఎఫ్ తో యష్ క్రియేట్ చేసిన హిస్టరీ అక్కడే ఆగలేదు. అప్పటి వరకూ సౌత్ వాళ్లే పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా.. సడెన్ గా పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో సౌత్ తో పాటు బాలీవుడ్ జనాలు కూడా యష్ కి ప్రశాంత్ నీల్ మేకింగ్ కి అల్టిమేట్ గా కెజిఎఫ్ కి ఫిదా అయిపోయారు. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా కన్నడ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. అలా ఫస్ట్ పార్ట్ సక్సెస్ కంటిన్యూ అవుతుండగానే సెకండ్ పార్ట్ మేకింగ్ స్టార్ట్ అయ్యింది.

KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మూవీ రివ్యూ..!

సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు బాలీవుడ్ లో కూడామంచి మార్కెట్ క్రియేట్ అవడంతో కెజిఎఫ్ 2 ని ఇంకా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ ని మించిన గ్రాండియర్, బడ్జెట్, స్టార్ కాస్ట్ తో స్కేల్ ని ఇంకా పెంచేశారు. బాలీవుడ్ ఆడియన్స్ ని గ్రాబ్ చెయ్యడం కోసం సంజయ్ దత్ లాంటి పవర్ ఫుల్ యాక్టర్ ని యష్ కి విలన్ గా సెట్ చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ ని తనను తాను పరిచయం చేసుకున్న యష్ కి.. ఏకంగా స్టార్ హీరో సంజయ్ దత్ ని యాడ్ చెయ్యడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

బాలీవుడ్ మరో స్టార్ యాక్టర్ రవీనా టాండన్ ని మరో పవర్ పుల్ రోల్ లో ప్రజెంట్ చేశారు. నువ్వా నేనా అంటూ పోటీపడి నటించిన ఈ పవర్ ఫుల్ యాక్టర్స్ అందరూ కెజిఎఫ్ 2ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు. కోవిడ్ బ్రేక్ ఇచ్చినా.. రిలీజ్ లేట్ అయినా కూడా.. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమా క్వాలిటీ కోసం కష్టపడ్డారు యష్ అండ్ టీమ్. అంతే కాదు.. ప్రమోషన్స్ విషయంలో కూడా.. బాలీవుడ్ లో హిందీ మాట్లాడుతూ, తమిళ్ ప్రెస్ మీట్ లో తమిళ్ మాట్లాడుతూ.. తెలుగు ఏరియాలో తెలుగు మాట్లాడుతూ.. యష్ తెగ ఇంప్రెస్ చేసేసి తన సింప్లిసీటీతో ఇంకాస్త క్లోజ్ అయ్యిపోయారు.

Prashanth Neel : కిక్కులో కిక్కెక్కే కథలు రాస్తాడు

ఆఖరికి తమిళ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ మూవీతో పోటీపడుతూ కెజిఎఫ్ 2 రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యిన ప్రతిచోటా.. యూనానిమస్ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కెజిఎఫ్ 2. అంతేకాదు.. అంతుకుముందు కన్నడ స్టార్ గురించి ఎప్పుడూ మాట్లాడని బాలీవుడ్.. ఇప్పుడు ఏకంగా యష్ ని ఆకాశానికెత్తేస్తోంది. కన్నడ మ్యాచో మాన్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తోంది. కంగనా అయితే.. అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రేంజ్ యాంగ్రీ యంగ్ మెన్ అంటూ పెద్ద పెద్ద పొగడ్తలే చేసింది.

Prashanth Neel: రెండు సినిమాలతోనే జక్కన్నకు పోటీగా ప్రశాంత్ నీల్..?

ప్రపంచం మొత్తం కన్నడ సినిమా గురించి మాట్లాడాలని ఎలా అయితే కల గన్నారో.. ఆ కలని కెజిఎఫ్ తో నెరవేర్చుకున్నారు అటు ప్రశాంత్ నీల్ తో పాటు యష్. ఇలా తన ఎనిమిదేళ్ల కథని కన్నడ సినిమా ప్రైడ్ గా మార్చి ప్రశాంత్ నీల్, ప్రశాంత్ కథకి యష్ తప్ప వేరే ఎవరూ మ్యాచ్ చెయ్యలేనంతగా మరిపించి కెజిఎఫ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ నే ఇప్పుడు కంటిన్యూ చెయ్యబోతోంది కెజిఎఫ్ 3.