KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మూవీ రివ్యూ..!

నాలుగేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో కేజిఎఫ్ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మూవీ రివ్యూ..!

Kgf2

నటీనటులు: యాష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్
సంగీతం: రవి బస్రుర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
నిర్మాత: విజయ్ కిరగందుర్
ఎడిటర్: శ్రవణ్ కుమార్
రచన-దర్శకత్వం: ప్రశాంత్ నీల్

నాలుగేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో కేజిఎఫ్ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కేజిఎఫ్ చాప్టర్-2 చిత్రంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో దాదాపుగా నాలుగు సార్లకు పైగా విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కేజిఎఫ్ చాప్టర్-2 చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.

KGF2: రాఖీ భాయ్‌పై భారీ అంచనాలు.. ఏం జరగబోతుంది?

కథ:
కేజీఎఫ్ మొద‌టి సినిమాలో రాకీ బంగారు గ‌నుల్లో ప‌నిచేసే కార్మికుల‌కు దేవుడిగా మారుతాడు. వారిని హింసించి, వారి ప్రాణాల‌ను తీసేవాళ్ల‌ను దారుణంగా చంపేస్తాడు. దీంతో ఆ కార్మికులు రాకీని త‌మ దేవుడిగా భావిస్తారు. ఇక ఆ బంగారు గ‌నుల య‌జ‌మాని అయిన‌ గ‌రుడ‌ను చివ‌ర‌కు రాకీ తుద‌ముట్టిస్తాడు. ఈ క్ర‌మంలో కేజీఎఫ్ రాకీ సొంత‌మ‌వుతుంది. అక్క‌డి నుంచి కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మొద‌ల‌వుతుంది. బంగారు గ‌నుల‌ను రాకీ సొంతం చేసుకోవ‌డంతో రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్‌, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు రాకీ వెంట ఉండాల్సి వ‌స్తుంది. అయితే రాకీ వీళ్ల‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాడు. అలాగే రీనాను తనతోపాటు కేజీఎఫ్ కు తీసుకెళ్తాడు. అక్క‌డ రాకీ సెటిల్ అయిపోతాడు. అయితే రాకీని కేజీఎఫ్ నుంచి బయటకు తీసుకురావాల‌ని.. ఆ గనుల‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని చాలా మంది య‌త్నిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే చ‌నిపోయాడ‌నుకున్న అధీరా (సంజ‌య్ ద‌త్‌) బ‌తికే ఉన్నాడ‌ని తెలిసి అత‌ని ద్వారా రాకీని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు య‌త్నిస్తారు. మ‌రి వాళ్ల ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైందా ? రాకీ బంగారు గ‌నుల‌ను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చాడా ? త‌రువాత ఏం జరిగింది ? చివ‌ర‌కు ఎలాంటి ముగింపును ఇచ్చారు ? అన్నది మిగతా కథ.

KGF2: యష్‌కు లైన్ క్లియర్.. కనెక్ట్ అయితే బాక్సులు బద్దలే!

విశ్లేషణ:
కేజీఎఫ్ మొద‌టి పార్ట్ క‌న్నా రెండో పార్ట్‌లో వ‌యొలెన్స్‌, యాక్ష‌న్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ లో ఎలివేషన్స్ తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చిన ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లోనూ అదే కంటిన్యూ చేశాడు. అందువ‌ల్ల మొద‌టి భాగం క‌న్నా రెండో భాగం మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా అల‌రిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మొద‌టి భాగం లాగే రెండో దాంట్లోనే య‌ష్.. రాకీ పాత్ర‌లో జీవించాడు. ఈ చిత్ర స్టార్టింగ్ లో రాఖీ బాయ్ ఇంట్రడక్షన్ మరో లెవెల్ లో ఉంది. త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన గరుడ పాత్రను కూడా ఒక రేంజ్ లో చూపించాడు. వీరితోపాటు శ్రీ‌నిధి శెట్టి, ప్రధానిగా ర‌వీనా టాండ‌న్, సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్‌, అనంత్ నాగ్ పాత్రలో ప్ర‌కాశ్ రాజ్ లు అద్భుతంగా న‌టించారు. మిగతా న‌టీన‌టుల పెర్పార్మెన్స్ కూడా బాగుంటుంది. అయితే ప్రశాంత్ నీల్ ఎక్కువగా ఒక్కో పాత్ర ఎలివేషన్ పై పెట్టిన దృష్టి డైలాగ్స్ పై కూడా పెట్టుంటే మంచి పట్టుండేది. అయినప్పటికీ హీరో యశ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఓవరాల్ గా చూస్తే ఫస్టాఫ్ మొత్తం బ్లాక్ డార్క్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. అయినప్పటికీ ఎలివేషన్స్ ని ఆయుధంగా వాడి ఎక్కడ బోర్ కొట్టించలేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించినప్పటికీ యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ తో కవర్ చేశారు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ పెట్టి బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్లు డైలాగులు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకి 100% న్యాయం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. కానీ ఫస్ట్ పార్ట్ లో కొన్ని సెంటిమెంట్ సీన్స్ పెట్టినట్లు చాప్టర్ 2 లో కూడా కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ యాడ్ చేసి ఉంటే మరింత ప్లస్ అయ్యేది.

KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?

సాంకేతిక వర్గం:
కన్నడ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ విజువల్ ట్రీట్.. సినిమాలో స్క్రీన్ ప్లే లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎలివేషన్స్ టైంలో తన టేకింగ్ విధానంతో ఆడియన్స్ ని కట్టి పడేశాడు. ప్రముఖ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి మరోమారు తన మార్క్ చూపించాడు. బీజీఎం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, అన్ని పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ అమ్మ పాటతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు, ఎలివేషన్స్ లో సినిమాని ఒక స్టెప్ పైకెళ్లేలా చేయగలిగాడు.

అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ కనిపించినా.. ఓవర్ ఆల్ గా సినిమాలో ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులు ఆశించే ఎలివేషన్లు.. ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకుల అంచనాలకు చాప్టర్ 2 ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడ్డాడు.