KGF2: యష్‌కు లైన్ క్లియర్.. కనెక్ట్ అయితే బాక్సులు బద్దలే!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.

KGF2: యష్‌కు లైన్ క్లియర్.. కనెక్ట్ అయితే బాక్సులు బద్దలే!

Kgf2

KGF2: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ మూవీ ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో హీరో యశ్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?

నిన్నటి వరకు తమిళ సినిమా బీస్ట్, కేజీఎఫ్ మధ్య యుద్ధం తప్పదని.. హీరోలు విజయ్, యష్ మధ్య బాక్సాపీస్ బాటిల్ తప్పదని భావించారు. కానీ.. బీస్ట్ నెగటివ్ టాక్ తెచ్చుకొని తొలి రోజే ఘోరమైన ట్రోల్స్ చవి చూసింది. భారీ ఫాలోయింగ్ ఉన్న తమిళనాడులోనే బీస్ట్ సినిమా మిక్సెస్ టాక్ తో రన్ అవుతుండడంతో కేజీఎఫ్ 2 సినిమాకి ఆల్ మోస్ట్ లైన్ క్లియర్ అయింది. అందుకు తగ్గట్లే ముందుగా ప్రీమియర్లు పడిన యూఎస్ లో కేజీఎఫ్ 2 సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

KGF2: యష్ పాన్ ఇండియా ప్రమోషన్.. తెలుగుపై స్పెషల్ టార్గెట్!

జెర్సీ లాంటి సినిమా వాయిదా వేసుకోగా.. ఆర్ఆర్ఆర్ దూకుడు తగ్గి, థియేటర్లను కూడా కొన్ని కేజీఎఫ్ కోసం కేటాయించారు. మొత్తంగా చూస్తే ఎటు చూసినా ఇప్పుడు కేజీఎఫ్ కోసం లైన్ క్లియర్ అయిపొయింది. ఇండియాలో కూడా సినిమాకి పాజిటివ్ టాక్ దక్కించుకొని.. కేజీఎఫ్ తొలి పార్ట్ మాదిరే ఎలివేషన్లు, హీరోయిజానికి కనుక ప్రేక్షకులు ఫిదా అయ్యేలా కనెక్ట్ అయితే.. మరోసారి బాక్సాపీస్ వద్ద యష్ ప్రభంజనం కనిపించడం ఖాయం.