RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

ట్రిపుల్ఆర్, కెజిఎఫ్2 రెండు సినిమాల భాషలు వేరైనా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయినా.. ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే. రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ సత్తా చాటిన సినిమాలే.

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

RRR-KGF2

RRR-KGF2: ట్రిపుల్ఆర్, కెజిఎఫ్2 రెండు సినిమాల భాషలు వేరైనా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయినా.. ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే. రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ సత్తా చాటిన సినిమాలే. భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో, అంతకన్నా భారీ హైప్స్ తో రిలీజ్ అయిన ఈ రెండు భారీ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ రాబట్టుకున్నాయో..? ఏ సినిమా బాలీవుడ్ లో తన స్టామినా చూపించిందో డీటెయిల్డ్ గా చూద్దాం.

RRR: 31 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో ఆర్ఆర్ఆర్!

ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్.. పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యిపోటీపడి మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగు, కన్నడ సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా, కంటెంట్ ఉన్న సినిమాగా చూసిన ఆడియన్స్ ఈ సినిమాల్ని అదే రేంజ్ లో సూపర్ హిట్ చేశారు ఆడియన్స్. ఓన్లీ సౌత్ లోనే కాదు.. మంచి సినిమా తీస్తే.. ఆల్ ఓవర్ ఇండియా అప్లాజ్ అందుకోవచ్చని, రికార్డుల్ని తిరగరాయొచ్చని ప్రూవ్ చేశాయి అటు ట్రిపుల్ఆర్, ఇటు కెజిఎఫ్. స్పెషల్లీ బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు కలెక్షన్ల సునామి సృష్టించాయి.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

500 కోట్ల బడ్జెట్, 300 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకున్నమోస్ట్ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్ ఆర్‌ ఆర్‌ఆర్‌. నార్త్ లో ముందునుంచీ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా.. ఓపెనింగ్ రోజే 20 కోట్లు కలెక్ట్ చేసింది ట్రిపుల్ఆర్. శనివారం 24కోట్లు, ఆదివారం 31 కోట్లతో వీకెండ్ ని దిగ్విజయంగా కంప్లీట్ చేసిన ట్రిపుల్ఆర్.. సోమవారం 17 కోట్లు, మంగళవారం 15 కోట్లుతో రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 100 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది ట్రిపుల్ఆర్. హిందీ మార్కెట్ లో ఎనిమిదో రోజు 13 కోట్లను రాబట్టిందంటే ఏ రేంజ్ లో ట్రిపుల్ ఆర్ మాయ చేసిందో అర్దంచేస్కోవచ్చు. బుధవారం 12, గురువారం 13 కోట్లతో సెకండ్ వీక్ లో కూడా కలెక్షన్లుకంటిన్యూ చేసింది. రెండో వారం అంతా కలిపి 75 కోట్లు కలెక్ట్ చేసింది ట్రిపుల్ఆర్. 3,4,5 వారంతో కంటిన్యూ అవుతూ 260 కోట్ల కలెక్షన్లు దాటేసి సౌత్ సత్తా చాటింది ట్రిపుల్ఆఱ్.

KGF2: హిందీలో కేజీఎఫ్ సునామీ.. రాఖీభాయ్ ఖాతాలో మరో రికార్డ్ ఖాయం!

కెజిఎఫ్ ఇప్పటికే వారం రోజుల్లోనే 255 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది. అసలు కెజిఎఫ్ బాలీవుడ్ లో ఫస్ట్ నుంచి దూకుడు చూపిస్తూనే ఉంది. కెజిఎఫ్ రిలీజ్ అయినరోజు ఏప్రిల్ 14 గురువారం.. 53.95 కోట్లు, శుక్రవారం.. 46.79కోట్లు, మూడో రోజైన శనివారం 42 కోట్లు, ఆదివారం 50 కలెక్ట్ చేసింది. వీక్ స్టార్టింగ్ డే అయిన సోమవారం కూడా 25 కోట్లు కలెక్ట్ చేసి క్రేజ్ తగ్గేదేలే అనిప్రూవ్ చేసింది. ఇక మంగళవారం 19 కోట్లు, బుధవారం 16 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం 255 కోట్ల కలెక్షన్లు దాటేసింది. బాహుబలి 8 రోజుల్లో, దంగల్, సంజు, టైగర్ జిందా హే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు..10 రోజుల్లో కలెక్ట్ చేసిన 250 కోట్ల కలెక్షన్లు కెజిఎఫ్2 జస్ట్ 7 రోజుల్లోనే బాలీవుడ్ లో కలెక్ట్ చేసింది. కెజిఎఫ్ ఇప్పటి వరకూ 800 కోట్లు దాటేసి వెయ్యి కోట్ల కలెక్షను చేరుకోవడానికి రెడీ అవుతోంది.