RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా అవతరించింది.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

RRR

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా అవతరించింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టడం మనం చూశాం.

RRR: ఆర్ఆర్ఆర్..ఇంకో నెల ఆగాల్సిందేనా..?

తారక్, చరణ్‌ల నటవిశ్వరూపానికి యావత్ సినీ ప్రేమికులు నీరాజనం పలకగా.. ఈ సినిమా ఇద్దరు హీరోల కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధలను చేసింది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ దక్కింది. ధీటైన సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీతిలో వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది.

RRR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సూపర్ సీన్.. ఎందుకు లేపేశారో..?

మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్ మోస్ట్ అన్ని చోట్లా భారీ మార్జిన్ లతో ఆల్ టైం రికార్డులు నెలకొల్పి చెరగని రికార్డులు నమోదు చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా హైదరాబాద్ నగరంలో మరో ఫీట్ సాధించిందట. హైదరాబాద్ సిటీలో ఈ చిత్రం ఏకంగా 46 సెంటర్లలో సెంటర్ కి 1 కోటి చొప్పున రూ.46 వసూళ్లు కొల్లగొట్టి మరో సంచలన రికార్డు నెలకొల్పింది. మిగతా బాషలలో కేజీఎఫ్-2 లాంటి సినిమాలు మార్జిన్ షేర్ చేసుకున్నా.. మన దగ్గర మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఈ రేంజ్ లో ఉంది. మరి ఈ సినిమాకి కొట్టే సినిమా ఎప్పుడుకి వస్తుందో చూడాలి.