RRR: ఆర్ఆర్ఆర్..ఇంకో నెల ఆగాల్సిందేనా..?

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా ఇద్దరు మేటి స్టార్స్...

RRR: ఆర్ఆర్ఆర్..ఇంకో నెల ఆగాల్సిందేనా..?

Rrr Ott Release Date Not Yet Locked

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా ఇద్దరు మేటి స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించడంతో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య రిలీజ్ చేయగా, తొలిరోజే అదిరిపోయే టాక్ తెచ్చుకుంది ఈ మూవీ.

RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు!

రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేసి తన సత్తా చాటింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్నా, కేజీయఫ్ చాప్టర్ 2 లాంటి మరో పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నా.. ఆర్ఆర్ఆర్ మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ ఇంకా సందడి చేస్తోంది. తారక్, చరణ్ ల పర్ఫార్మెన్స్ ను వెండితెరపై చూసేందుకు ఆడియెన్స్ ఇంకా ఆసక్తిని చూపుతున్నారంటే ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

RRR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సూపర్ సీన్.. ఎందుకు లేపేశారో..?

అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు కావస్తున్నా, ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ ను మాత్రం లాక్ చేయలేదు చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఓటీటీలో దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకే ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ మే 25న కానీ.. జూన్ ఫస్ట్ వీక్ లో కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.