RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ...

RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు!

RRR

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయగా, తొలిరోజే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ఇక రాజమౌళి సినిమా అనగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

RRR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సూపర్ సీన్.. ఎందుకు లేపేశారో..?

ఆర్ఆర్ఆర్ సినిమాకు అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతూ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 5వ వారంలోకి అడుగుపెట్టిన ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

RRR: ఓటీటీలో ట్రిపుల్ ఆర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాహుబలి2 తరువాత ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.