RRR: 31 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో ఆర్ఆర్ఆర్!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తరువాత తెరకెక్కించిన మరో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ...

RRR: 31 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో ఆర్ఆర్ఆర్!

Rrr 31 Days Worldwide Collections

RRR: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తరువాత తెరకెక్కించిన మరో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

ఈ సినిమాకు తొలిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. పీరియాడికల్ ఫిక్షన్ కథతో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా, ఇంకా ఆర్ఆర్ఆర్ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తూనే ఉంది. కేజీయఫ్-2 లాంటి మరో పాన్ ఇండియా మూవీ గట్టి పోటీనిస్తున్నా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తన వసూళ్ల వరదను కంటిన్యూ చేస్తూ ఉంది.

RRR: ఆర్ఆర్ఆర్..ఇంకో నెల ఆగాల్సిందేనా..?

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ ఓ సరికొత్త మార్క్‌ను టచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రస్తుతం రూ.598 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. మరో రూ.2కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ ఏకంగా రూ.600 కోట్ల షేర్ మార్క్‌ను టచ్ చేయనుంది. తారక్ కొమురం భీంగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా తమ నటవిశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 రోజులు ముగిసేసరికి వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.110.57 కోట్లు
సీడెడ్ – రూ.50.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.34.55 కోట్లు
ఈస్ట్ – రూ.16.02 కోట్లు
వెస్ట్ – రూ.13.09 కోట్లు
గుంటూరు – రూ.17.95 కోట్లు
కృష్ణా – రూ.14.47 కోట్లు
నెల్లూరు – రూ.9.23 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.266.38 కోట్లు(షేర్) (రూ.402.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.43.50 కోట్లు
తమిళనాడు – రూ.38.02 కోట్లు
కేరళ – రూ.10.45 కోట్లు
హిందీ – రూ.130.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.9.12 కోట్లు
ఓవర్సీస్ – రూ.100.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.598.52 (షేర్) (రూ.1110.05 కోట్లు గ్రాస్)