North Heroins: బ్రేక్ ఇచ్చిన సౌత్ మీద నోరు పారేసుకుంటున్న నార్త్ హీరోయిన్స్!

అవసరం ఉన్నప్పుడు ఆహా.. ఓహో అని పొగిడి.. అవకాశాలు రాకపోతే అడ్డమైన కామెంట్లు చేస్తున్నారు కొంతమది హీరోయిన్లు. నార్త్ రిలేటెడ్ హీరోయిన్స్ కి అక్కడ అవకాశాలు లేక.. రాక సౌత్..

North Heroins: బ్రేక్ ఇచ్చిన సౌత్ మీద నోరు పారేసుకుంటున్న నార్త్ హీరోయిన్స్!

North Heroins

North Heroins: అవసరం ఉన్నప్పుడు ఆహా.. ఓహో అని పొగిడి.. అవకాశాలు రాకపోతే అడ్డమైన కామెంట్లు చేస్తున్నారు కొంతమది హీరోయిన్లు. నార్త్ రిలేటెడ్ హీరోయిన్స్ కి అక్కడ అవకాశాలు లేక.. రాక సౌత్ ఇండస్ట్రీకి వచ్చి సినిమాల్లో నిలదొక్కుకున్నారు. ఇక్కడ కాస్తో కూస్తో ఫేమ్, నేమ్ వచ్చాక.. మళ్లీ బాలీవుడ్ చెక్కేసి.. సౌత్ మీద ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ.. సౌత్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్నారు. ఇలా నోటికొచ్చింది మాట్లాడి అడ్డంగా బుక్కయిన హీరోయిన్లెవరో చూద్దాం.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

నార్త్ బేస్డ్ హీరోయిన్లకి ఫస్ట్ లో బాలీవుడ్ లో నిలదొక్కుకునేంత సీన్ లేదు.. అక్కడ అంతగా అవకాశాలు ఇచ్చేవాళ్లుకూడా తక్కువే. ఇక మనసౌత్ వాళ్లకి బాలీవుడ్ హీరోయిన్లంటే సినిమా వెయిట్ బావుంటుందని.. అక్కడవాళ్లని ఇక్కడి సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ.. వాళ్లకి కెరీర్ బ్రేక్ ఇస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం ఏరు దాటాక తెప్పతగలేస్తూ.. సౌత్ మీద ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్ గా రాశిఖన్నా.. సౌత్ మీద షాకింగ్ కామెంట్స్ చేసి ఫాన్స్ కి అడ్డంగా బుక్కైంది.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

2013లో మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన రాశిఖన్నా.. అక్కడ అవకాశాలు రాకపోవడంతో ఊహలుగుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూ.. తెలుగు, తమిళ్, మళయాళం ఇలా సౌత్ హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పడు మళ్లీ బాలీవుడ్ కి జంప్ అయ్యింది. అక్కడ అవకాశాలు పెరగడంతో ఇన్నాళ్లూ సౌత్ లో ఒకేరకం క్యారెక్టర్లు చేసి.. నాలో ఇంత టాలెంట్ ఉందనే మర్చిపోయాను. సౌత్ వాళ్లకు హీరోయిన్లు కమర్షియల్ యాంగిల్ లోనే కావాలి అందుకే.. ఇప్పటి వరకూ కొత్త క్యారెక్టర్లో కనిపించలేకపోయాను.. ఇప్పటినుంచి బాలీవుడ్ కథలతో కొత్త రాశిఖన్నాని చూస్తారు అంటూ సౌత్ మీద చెత్త కామెంట్లు చేసింది.

South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!

కెరీర్ స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా నార్త్ లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు పూజాహెగ్డేని. ఆ తర్వాత సౌత్ మీద బాగా కాన్సన్ ట్రేట్ చేసింది. దెబ్బకి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ అటు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పూజా ఫుల్ బిజీగా ఉంది. మరి ఇంత స్టార్ డమ్ తెచ్చి పెట్టిన సౌత్ అంటే ప్రేమ ఉండాలి కానీ.. పనికి రాని కామెంట్లు చేసింది. మొన్నామధ్య.. బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ గురించి అనవసరమైన కామెంట్స్ చేసింది. సౌత్ ఆడియన్స్ కి నడుము అంటే చాలా ఇష్టమని, మిడ్ డ్రెస్ ల్లోనే చూడాలనుకుంటారని, సినిమాల్లో కంపల్సరీగా హీరోయిన్ నడుము మీదే కాన్సన్ ట్రేట్ చేస్తారని సోషల్ మీడియా సాక్షిగా చెప్పింది. ఈ కామెంట్ తో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంది పూజా హెగ్డే.

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

తెలుగు సినిమాలతోనే హీరోయిన్ గా గుర్తింపుతెచ్చుకున్న పంజాబీ హీరోయిన్ తాప్సీ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటి కామెంట్లే చేసింది. టాలెంట్ కన్నా గ్లామర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని, అందరూ నడుము మీదే కాన్సన్ ట్రేట్ చేస్తారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. బాలీవుడ్ సినిమాల్లో ఏమాత్రం అవకాశాలు లేని టైమ్ లో సౌత్ లో సినిమాలు చేసి కెరీర్ ని బిల్డప్ చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు రాగానే ఇలా సౌత్ గురించి కామెంట్ చెయ్యడం కరెక్ట్ కాదని అప్పట్లో ఓరేంజ్ లో ఆడుకున్నారు జనాలు.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

బోల్డ్ క్యారెక్టర్స్ చేసే బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా సౌత్ మీద ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంది. హీరోయిన్ ని రెండు గంటల ముందే సెట్ కి పిలిపించి వెయిట్ చేయిస్తారని, హీరోయిన్ అంటే గ్రాంటెడ్ గా తీసుకుని బిహేవ్ చేస్తారని పబ్లిక్ గా సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్ చేసింది. స్కిన్ షో చేస్తే సౌత్ జనాలు ఫ్లాటయిపోతారు అంటూ అవాకులు చవాకులు పేలింది తెలుగులో 3 సినిమాలు చేసిన రాధికా ఆప్టే. ఇలా ఇక్కడ సినిమాలు చేసి.. ఇక్కడ డబ్బు సంపాదించుకుంటూ.. సౌత్ మీదే నోరుపారేసుకుంటున్నారు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు.