Hari Hara Veeramallu: జాక్వెలిన్ కాదు.. పవన్ సినిమాలో ముంబై మనోహరి!

పవన్ హరిహర వీరమల్లులో జాక్వెలిన్ ప్లేస్ ను మరో బాలీవుడ్ బ్యూటీ చోరీ చేసేసింది. ఆ అందాల బాహుబలి మనోహరి.. ఔరంగజేబు చెల్లెలిగా మారబోతుంది. పవర్ స్టార్ ఫ్రెండ్ లా కనిపించబోతుంది.

Hari Hara Veeramallu: జాక్వెలిన్ కాదు.. పవన్ సినిమాలో ముంబై మనోహరి!

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu: పవన్ హరిహర వీరమల్లులో జాక్వెలిన్ ప్లేస్ ను మరో బాలీవుడ్ బ్యూటీ చోరీ చేసేసింది. ఆ అందాల బాహుబలి మనోహరి.. ఔరంగజేబు చెల్లెలిగా మారబోతుంది. పవర్ స్టార్ ఫ్రెండ్ లా కనిపించబోతుంది. తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఈ లక్కీ ఆఫర్ ను కొట్టేసిన ఆ బీటౌన్ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!

ఇలా వయ్యారాలు వలకబోస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రోల్ ను క్యాచ్ చేసింది నోరా ఫతేహీ. పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లులో యువరాణిగా కనిపించబోతుంది. వివిద కారణాలతో జాక్వెలిన్ వదులుకున్న ఔరంగజేబు చెల్లెలు రోషనారా బేగమ్ క్యారెక్టర్ లో నోరా ఫతేహీ నటించబోతుంది. షాజహాన్ మూడో భార్య కూతురే రోషనారా బేగమ్. ఔరంగ జేబు నాటి కాలానికి తీసుకెళ్తోన్న హరిహర వీరమల్లులో రోషనారాగా గ్లామర్ డాల్ నోరా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

Hari Hara Veeramallu: చెమటోడుస్తున్న పవన్.. రిస్కీ షాట్స్ చేయబోతున్నాడా?

ఎన్టీఆర్ టెంపర్ సాంగ్ తో రెచ్చిపోయాక బాహుబలి మనోహరి సాంగ్ ఆపై రవితేజ కిక్ 2, వరుణ్ లోఫర్, నాగ్ ఊపిరి సినిమాల్లో స్టెప్పులేసింది ఈ స్పెషల్ గర్ల్. రాఖీ హ్యండ్సమ్, సత్యమేవ జయతే, భుజ్ వంటి హిందీ సినిమాల్లోనూ ఐటమ్ డాల్ గానే అలరించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ నోరాపేరు చెప్తే గుర్తుకొచ్చేది ఐటమ్ సాంగ్సే. కెరీర్ మొత్తం ఇలా స్పెషల్ గానే కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిలా ఏకంగా పవన్ సినిమాలో సూపర్ రోల్ దక్కించుకుంది. వజ్రాల దొంగగా, బందిపోటుగా పవర్ స్టార్ కనిపించబోతున్న హరిహర వీరమల్లులో ఆయన స్నేహితురాలుగా నటిస్తోంది.

Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

నోరా సంగతలా ఉంటే హరిహర వీరమల్లులో రాకుమారిగా పవన్ ప్రేయసిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. చాలా ప్రిస్టీజియస్ గా ఈ పీరియాడికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఇక ఇందులోని క్యారెక్టర్ కోసం పవన్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సౌత్ తో పాటూ హిందీలో తీసుకురాబోతున్నారు నిర్మాత ఎం రత్నం. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతి కానుకగా హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.