Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!

తాజాగా ‘భీమ్లా నాయక్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్..

Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu: తాజాగా ‘భీమ్లా నాయక్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 8 నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించగా.. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపి.. దసరాకు సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Hari Hara Veeramallu: చెమటోడుస్తున్న పవన్.. రిస్కీ షాట్స్ చేయబోతున్నాడా?

‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ను ఓ వార్ సీన్ తో తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. హై యాక్షన్ సీన్లలో తన ఫ్యాన్స్ ను మెప్పించేందుకు యుద్ధ విద్యల్లో తన నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. అంతకు ముందు పవన్‌ సెట్‌లో యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు బయటకొచ్చి తెగ వైరల్ గా మారగా.. తాజాగా మేకర్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ టైంలో పవన్ కళ్యాణ్ ఎంతటి నైపుణ్యం చూపించారనే విషయాన్ని వీడియో రూపంలో వెల్లడించారు.

Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

ఈ సందర్భంగా ‘ది వారియర్స్ వే’ The Warriors Way అంటూ ప్రీ షూట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ లో అదిరిపోయే యాక్షన్ సీన్లలో తన యుద్ధ నైపుణ్యాన్ని చూపించారు. మెరుపు వేగంతో బళ్లాలను దూస్తూ.. ప్రత్యర్థులను మట్టుబెడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పద్శ శ్రీ తోట తరణి సారథ్యంలో భారీ సెట్ వర్క్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కథనాయికగా హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఏ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దంలోని మొఘల్ కాలం నాటి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.