‘హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్.. వైరల్ అవుతున్న పిక్..

‘హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్.. వైరల్ అవుతున్న పిక్..

Pawan: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగులో పవన్ బిజీగా ఉన్నారు. గతేడాది ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్ చెయ్యగా రెస్పాన్స్ అదిరిపోయింది..

PSPK 27

]తాజాగా షూటింగ్ స్పాట్‌లో లీక్ అయిన పవన్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్ర కథకు తగ్గ కాస్ట్యూమ్స్‌తో రాజసంగా నడుచుకుంటూ వస్తున్న పవర్ స్టార్ ఫొటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది..

PSPK 27

నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేశారని సమాచారం.. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం.. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

PSPK 27