Project – K : ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – కె’ ప్రారంభం..
రెబల్ స్టార్ ప్రభాస్ క్లాప్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది టీమ్..

Project K
Project-K: రెబల్ స్టార్ ప్రభాస్, ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్, ఎపిక్ ఫిల్మ్ షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా శనివారం(జూలై 24)న స్టార్ట్ అయింది.
బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ దీపికా పదుకొణే ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. వైజయంతి సంస్థ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి ‘Project – K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
గురు పౌర్ణమి పర్వదినాన ఇండియన్ సినిమా గురు అమితాబ్‌తో షూటింగ్ స్టార్ట్ చేశామని చెబుతూ, రెబల్ స్టార్ ప్రభాస్ క్లాప్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది టీమ్. ప్రస్తుతం అమితాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకు స్క్రిప్ట్ మెంటార్‌గా పనిచేస్తుండడం విశేషం.
?? ??????…
On the special day of #GuruPurnima, We start with the guru of Indian cinema.
Clap by our #Prabhas.#ProjectK@SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/kvxcKNbLMT— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2021