‘పుష్ప’ రాజ్ ఆగస్టు 13న వస్తున్నాడు..

‘పుష్ప’ రాజ్ ఆగస్టు 13న వస్తున్నాడు..

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రారంభమైంది..

‘ఆర్య, ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. తాజాగా ‘పుష్ప’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఆగస్టు 13న ‘పుష్ప’ రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

బన్నీ ఊరమాస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Pushpa