Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

కోడల్లేని అత్త గుణవంతురాలు అని ఎవరన్నారో కానీ.. ఈ అత్తగారు మాత్రం కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందని దాదాపు 10 ఏళ్ల నుంచి..

Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

Ranbir Alia

Ranbir-Alia: కోడల్లేని అత్త గుణవంతురాలు అని ఎవరన్నారో కానీ.. ఈ అత్తగారు మాత్రం కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందని దాదాపు 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ అత్తగారికి కోడలు ఆలియా రూపంలో అడుగుపెట్టబోతోంది.

Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

రావమ్మా మహాలక్ష్మి అంటూ పాత సినిమాలో పాట పడుకున్నట్లు.. ఇలాగే.. అచ్చం ఇలాగే ఎప్పుడెప్పుడు కోడలొస్తుందా అని ఎదురుచూస్తోంది ఈ అత్తగారు. బాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ వెడ్డింగ్ రణబీర్ ఆలియా పెళ్లి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే రణబీర్ కపూర్ తల్లి నీతూకపూర్ కూడా అంతకంటే ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నానంటోంది.

Alia Bhatt Ranbir Kapoor Marriage: వెడ్డింగ్ డేట్ లాక్.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వేదిక ఫిక్స్?

కొడుకు కుదిరినప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఊరుకుంటున్నారు ఈజనరేషన్ మదర్స్. కానీ రణబీర్ కపూర్ విషయంలో ఏమాత్రం ఎంతత్వరగా పెళ్లి చేసుకుంటాడా, కోడలు ఎప్పుడొస్తుందా అని 10 ఏళ్ల వెయిట్ చేస్తోంది రణబీర్ తల్లి నీతూకపూర్. రణబీర్ ఇప్పటికే దీపికా, కత్రినాతో డేటింగ్ చేశాడు. దీపికాతో ఆల్ మోస్ట్ పెళ్లి వరకూ వెళ్లింది. కానీ రకరకాల రీజన్స్ తో దీపికాతో రిలేషన్స్ తో బ్రేకప్ అయిపోయింది. సో.. అప్పుడు కూడా కోడలు వస్తుందనే కోరిక నెరవేరలేదు నీతూకపూర్ కి.

Alia Bhatt: అలియా నామస్మరణ.. ఏవుడ్‌లో చూసినా భట్ బేబీ పేరే!

దీపికా పదుకోన్ తో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ తో కూడా కొన్నాళ్లు ప్రేమాయణం నడపడంతో.. కత్రినా అయినా కోడలిగా వస్తుందనుకున్నారు నీతూకపూర్. కానీ కత్రినా కూడా బ్రేకప్ చెప్పేసింది. లాస్ట్ కి రణబీర్ ఆలియా దగ్గరకొచ్చి ఆగడంతో.. ఈ సారి మాత్రం ఆలియాతో పెళ్లికి తొందరపెడుతోంది నీతూ. ఈరోజు ఓకే అంటే.. ఈరోజే పెళ్లి చెయ్యడానికి రెడీగా ఉన్నామని కూడా చెబుతున్నారు రణబీర్ తల్లి. ఈ సారి పెళ్లి చేసుకుని ఈ రిలేషన్స్ కి హ్యాపీ ఎండింగ్ చెబుతాడని, అందుకే ఆలియా కోడలిగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు రణబీర్ ఫ్యామిలీ.