Reddy Garintlo Rowdyism : వీళ్లని బాగానే వాడుకున్నారుగా..

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు..

Reddy Garintlo Rowdyism : వీళ్లని బాగానే వాడుకున్నారుగా..

Reddy Garintlo Rowdyism Movie Teaser

Reddy Garintlo Rowdyism: ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా, సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. రచయితలు ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి స‌మ‌ర్ప‌కులు. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ సినిమా టీజర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని అభిల‌షిస్తూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు వినాయ‌క్‌.

ఈ సంద‌ర్భంగా హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ.. ‘‘మా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ మూవీ టీజ‌ర్‌ విడుద‌ల చేసి, అభినందించిన వినాయ‌క్‌ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. సినిమా విషయానికి వ‌స్తే.. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హ‌కారంతో సినిమాను స‌కాలంలో పూర్తి చేశాం. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. హైద‌రాబాద్‌, గోవా, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశాం.

Reddy Garintlo Rowdyism

సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి. న‌లభై ఎనిమిది రోజుల్లోనే ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాం. టైటిల్ చూసి ఇదేదో ఓ వ‌ర్గానికి సంబంధించిన సినిమా అనో, మ‌రో వ‌ర్గాన్ని కించ ప‌రిచే సినిమా అనో అనుకోకండి. సినిమా చూస్తే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థ‌మ‌వుతుంది. హీరోగా మంచి గుర్తింపు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. సీనియ‌ర్ న‌టి వాణీ విశ్వ‌నాథ్ సోదరి కుమార్తె వ‌ర్షా విశ్వ‌నాథ్ మా సినిమాలో హీరోయిన్‌గా న‌టించారు.

అలాగే సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్‌ విల‌న్‌గా చేశారు. ఆయ‌న‌తో న‌టించే స‌మ‌యంలో న‌టుడిగా చాలా విష‌యాల‌ు నేర్చుకున్నాను. నేను హీరోగా యాక్ట్ చేస్తున్న రెండో సినిమా పూర్తి కావ‌చ్చింది. మ‌రో రెండు సినిమాలు వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయి. అలాగే ఓ పాన్ ఇండియా మూవీ కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది’’ అన్నారు.

Reddy Garintlo Rowdyism

దర్శకులు ఎం. ర‌మేష్‌, గోపి మాట్లాడుతూ.. ‘‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అలాగే మ‌హిత్ నారాయ‌ణ్‌ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మా సినిమా తొలి పాట‌ను వై.ఎస్‌.ష‌ర్మిల‌ విడుద‌ల చేశారు.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ రెండో సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ రెండు సాంగ్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు వినాయ‌క్‌ టీజ‌ర్ విడుద‌ల చేసి స‌పోర్ట్ అందించారు. అంద‌రికీ మా యూనిట్ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.