Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ హెల్త్ పై రిపబ్లిక్ డైరెక్టర్

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ దేవకట్టా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ హెల్త్ పై రిపబ్లిక్ డైరెక్టర్

Sai

Updated On : September 28, 2021 / 8:55 PM IST

Sai Dharam Tej :  సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రిపబ్లిక్’. దేవకట్టా చాలా రోజులు గ్యాప్ తీసుకొని దర్శకత్వం వహించిన సినిమా. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ దేవకట్టా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ తో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ముందు చాలా సీరియస్ గా ఉందని తర్వాత పర్లేదు అని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై ప్రకటనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులంతా సాయి తేజ్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తున్నారు. దేవకట్టా మాట్లాడుతూ.. నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా ‘రిపబ్లిక్’. నా విజ‌న్‌లోనే న‌న్ను సినిమా తీసేలా సాయి తేజ్ ఎంక‌రేజ్ చేశాడు. సైనికుడిలా నాకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. యాక్సిడెంట్ త‌ర్వాత ఆయన్ను కలిశాను. అక్టోబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని ఆయనతో మాట్లాడిన త‌ర్వాతే ఫైన‌ల్‌గా ఓకే చేశామని తెలిపారు. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా సాయి తేజ్ తర్వాత చూశాడని తెలిపారు.

Posani Krishna Murali : పోసాని పై విరుచుకుపడ్డ జెంటిల్మెన్ సినిమా నిర్మాత

త‌ను 100% ప‌ర్సెంట్ రికవరీ అయ్యేవరకు ఐసోలేష‌న్‌లో ఉంటేనే మంచిద‌ని డాక్టర్లు అభిప్రాయ పడ్డారని తెలిపారు. సాయి తేజ్ త్వ‌ర‌గా కోలుకుంటున్నాడని, ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నాడని, కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటున్నాడని తెలిపారు. సాయి తేజ్ పూర్తిగా రిక‌వ‌ర్ అవ్వడానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంది అని దేవాకట్టా తెలిపారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు.