KGF2: ఆర్ఆర్ఆర్ ఆదర్శం.. జక్కన్న బాటలోనే కేజీఎఫ్ ప్రమోషన్స్!

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కోసం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పీక్స్ లో చేశారు రాజమౌళి. ఇప్పుడు కేజిఎఫ్ 2 టీమ్ కూడా ఆయన బాటలోనే నడుస్తోందా? అంటే అవుననే అంటున్నారు కేజిఎఫ్ సినిమా కోసం ఈగర్ గా..

KGF2: ఆర్ఆర్ఆర్ ఆదర్శం.. జక్కన్న బాటలోనే కేజీఎఫ్ ప్రమోషన్స్!

Kgf2

KGF2: పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కోసం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పీక్స్ లో చేశారు రాజమౌళి. ఇప్పుడు కేజిఎఫ్ 2 టీమ్ కూడా ఆయన బాటలోనే నడుస్తోందా? అంటే అవుననే అంటున్నారు కేజిఎఫ్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్. రీసెంట్ గా కెజీఎఫ్ 2 ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఇంటర్వ్యూస్ ఇస్తూ అక్కడి ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. ఇలా ఇండియా మొత్తం కవర్ చేస్తారా?, ప్రమోషన్స్ తో కిక్ ఇచ్చి, ఆడియన్స్ ను ఎంగేజ్ చేయబోతున్నారా ? ఫుల్ డిటైల్స్ స్టోరీలో చూద్దాం.

KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

4 సంవత్సరాలు ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురు చూశారు. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. మూడు సంవత్సరాల నుంచి అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ 2 పైకి ఫోకస్ షిఫ్ట్ చేశారు ఆడియన్స్. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ ప్రమోషన్స్ తో సినిమాపైన భారీ హైప్ తీసుకొచ్చారు రాజమౌళి. ఇప్పుడు కేజిఎఫ్ 2 టీమ్ కూడా బెంగుళూరు ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ కు ఇండియా వైడ్ మీడియాను ఇన్వైట్ చేసి, కరణ్ జోహార్ తో హోస్టింగ్ చేపించి కేజిఎఫ్ 2 థియేట్రికల్ ట్రలర్ రిలీజ్ చేసి, ఈ సినిమా ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు.

KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!

రాజమౌళి సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా 15 రోజుల ముంద నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కెజిఎఫ్ 2 కూడా రిలీజ్ 15 రోజులుందనగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఎప్పుడు స్టార్ట్ చేసినా అల్టిమేట్ గా సినిమాకు కావల్సింది రీచింగ్. అందుకే రాఖీ భాయ్ కూడా రీచింగ్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఇటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ.. యాక్షన్ ఎలివేషన్స్, సంజయ్ దత్ విలనీ పెర్ఫామెన్స్, రవీనాటండన్ ఎమోషన్స్, శ్రీనిధి శెట్టి గ్లామర్ డోస్ చూసేందుకు కేజిఎఫ్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ ని ఇప్పుడు ఇంటర్వ్యూస్, ఇంటరాక్షన్ తో ఎట్రాక్ట్ చేస్తున్నారు ఈ సినిమా స్టార్స్.

KGF2: కేజీఎఫ్ చాఫ్టర్-2 రన్ టైమ్ లాక్.. సెన్సార్ రిపోర్ట్ ఇదే!

కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే.. చాప్టర్ 2కి భారీ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ అంచనాల మధ్య కేజిఎఫ్ 2 ఈ నెల 14న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ టాప్ మోస్ట్ వ్యూయర్ షిప్ తో రికార్డుల మీద రికార్డుల మోత మోగిస్తున్నాయి.

KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

100కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ 2 పాన్ ఇండియా రేంజ్ రీచ్ పెంచుకోవడానికి సౌత్ టు నార్త్ ఆడియన్స్ ను కవర్ చేస్తూ ఇంట్రాక్ట్ అవుతున్నారు ఈ సినిమా స్టార్ కాస్ట్. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన కేజీఎఫ్2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన టీమ్.. లేటెస్ట్ గా జరిగిన ఢిల్లీ.. ఇలా వరసగా ఒక్కొక్క ఈవెంట్ తో సినిమా మీద మరింత హైప్ పెంచుతున్నారు.