Oo Antava Song: సామ్ స్పెషల్ సాంగ్.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

ఊ అంటావా అంటూ పుష్ప సాంగ్ జనాల్ని ఎంతలా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం. సిజ్ లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అవుతోన్న ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరవుతుందో.. దీనికి పేరడిగా..

Oo Antava Song: సామ్ స్పెషల్ సాంగ్.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

Pushpa Samantha

Oo Antava Song: ఊ అంటావా అంటూ పుష్ప సాంగ్ జనాల్ని ఎంతలా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం. సిజ్ లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అవుతోన్న ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరవుతుందో.. దీనికి పేరడిగా వస్తోన్న పాటలూ అంతే వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ఊ అంటావా.. ఉ ఉ అంటావా.. ఇప్పుడెక్కడ విన్నా ఇవే లైన్స్ వినిపిస్తున్నాయి. పుష్పలో సమంతా ఐటమ్ సాంగ్ మాత్రమే కాదు.. దానికి పేరడీగా వస్తోన్న సాంగ్స్ కూడా ఫుల్ వైరల్ గా మారుతున్నాయి.

Telugu Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. ఏ పెద్ద సినిమా అయినా వారం రోజులే!

యూట్యూబ్ లో వ్యూస్ పరంగా హైయ్యెస్ట్ రికార్డ్ సాధిస్తోంది పుష్ప పాట. సిజ్ లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ సమంతాను సెలెబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. అయితే మగాళ్ల బుద్ధి వంకర బుద్ధా అని క్వశ్చన్ చేస్తూ కొన్ని మగాళ్ల సంఘాలు ఈ పాటపై కేసులు పెట్టారు. ఇంక లాభం లేదనుకుని కొందరు క్రేజీ గయ్స్.. ఊ అంటావాకు మేల్ వర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడా పాటలు మామూలు హడావిడీ చేయట్లేదు.

Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?

ఈ మేల్ వర్షన్ షేర్ చేస్తూ మగాళ్లను తలెత్తుకునేలా చేసావ్ గా అంటూ ఫన్నీ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ మేల్ వర్షన్ ను క్రియేట్ చేసిన ప్రశాంత్, రమణలను కొందరు మెచ్చుకుంటుంటే.. ఇంకొందరు ఆడలేడీస్ దుమ్ముదులిపేస్తున్నారు. మేల్ వర్షన్ వర్సెస్ ఫిమేల్ వర్షన్ అంటూ సోషల్ మీడియా రాయుళ్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సామ్ ఒరిజనల్ ఐటమ్ సాంగ్ ను షార్ట్స్, ట్రోలింగ్ వీడియోలకు ఎంతలా వాడుకున్నారో.. ఈ మేల్ వర్షన్ సాంగ్ ను అంతే రేంజ్ లో యూజ్ చేస్తున్నారు.

Raai Laxmi: ఫోటో షూట్‌లతో రత్తాలు రచ్చ..!

అన్నింటికి మించి అన్న లెవెల్ లో బ్రహ్మీ వీడియోస్ ను వాడి వదులుతున్న బిట్స్.. ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్క బ్రహ్మానందాన్నే కాదు.. పవన్, ప్రభాస్, తారక్, చిరూ ఇలా మేల్ సూపర్ స్టార్స్ అందర్ని ఈ పేరడి సాంగ్ లో చూపించి ఇంకో ఔత్సాహిక ట్రోలర్.. లిరిక్స్ మార్చి కొత్త పాటను సృష్టించాడు. ఇక బాలయ్య వర్షన్ సింగిల్ గా కేక పెట్టిస్తుంటే.. అంతకుమించి అన్న లెవెల్ లో ట్రెండ్ అవుతోంది బ్రహ్మానందం స్పూఫ్ వీడియో. ఇలాంటి ఐడియా ఎలా వస్తాయ్ రా బాబు అంటూనే సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు జనాలు.

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

దేవీశ్రీ ప్రసాద్ ప్రెస్ మీట్ లో ఆల్రెడీ చెప్పాడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేసిన శోభరాజ్ వంటి దిగ్గజ ఆథ్మాత్మిక గాయని సైతం.. ఊ అంటావా ట్యూన్ లో మాధవున్ని కీర్తించారు. గీతా జయంతి నాడు ఆమె పాడి.. రిలీజ్ చేసిన వీడియో సైతం జనాల్ని ఆకట్టుకుంది. ఇక మేమేం తక్కువ అంటూ ప్రభువు బిడ్డలు కొందరు ఊ అంటావా అంటూ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. జనాలకి నీతి వ్యాక్యాలు మామూలుగా చెప్తే ఎక్కట్లేదని.. ఇలా పుష్ప ట్యూన్ తీసుకుని మైండ్ ట్యూన్ చేసే పని చేస్తున్నారు. చూడటానికి ఫన్ గా అనిపించినా.. జీసస్ మంచి మాటల్ని మిక్స్ చేసారిందులో.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

పుష్ప ఐటమ్ సాంగ్ గా వచ్చిన ఊ అంటావా పాట చాలా వర్షన్స్ తీసుకుంటోంది. గంగ.. చంద్రముఖిగా మారినట్టు ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ హిట్ ట్యూన్ తోనే మేల్ వర్షన్స్, భక్తి పాటలొస్తుంటే.. మేమేం తక్కువా అంటూ పొలిటికల్ పెద్దలను టార్గెట్ చేస్తూ మరికొందరు విజృంబిస్తున్నారు. ఏకంగా ఎక్స్ సీఎం చంద్రబాబు, ప్రెజెంట్ సీఎం జగన్ లపైనే పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒకటా, రెండా.. సమంత సాంగ్ ను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్న రేంజ్ లో ట్రెండ్ కొనసాగుతోంది. కవర్ సాంగ్స్, షార్ట్స్, పేరడీ.. ఇలా ఎక్కడ చూసినా పుష్ప సాంగ్ వినిపిస్తూనే ఉంది. చేయక చేయక సమంతా ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తే.. అది ఇంతలా షేక్ చేస్తుందని సామ్ కూడా ఎక్స్ పెక్ట్ చేసుండదేమో.