Telugu Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. ఏ పెద్ద సినిమా అయినా వారం రోజులే!

వారానికో సినిమా.. ఆ వారానికే కలెక్షన్స్.. అదే వారంలో హిట్టా, ఫట్టా చెప్పే కలెక్షన్. మరీ సినిమా అద్దిరిపోతే ఇంకో వారం థియేటర్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇండియా..

Telugu Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. ఏ పెద్ద సినిమా అయినా వారం రోజులే!

Telugu Movies

Telugu Movies: వారానికో సినిమా.. ఆ వారానికే కలెక్షన్స్.. అదే వారంలో హిట్టా, ఫట్టా చెప్పే కలెక్షన్. మరీ సినిమా అద్దిరిపోతే ఇంకో వారం థియేటర్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇండియా వైడ్ కనిపిస్తోంది. గతంలో కనిపించిన 100 రోజుల వేడుకలు, 1000 రోజుల రికార్డులు ఇప్పట్లో సాధ్యమయ్యేలా మాత్రం కనిపించడటం లేదు. వారం మహా అయితే 10 రోజులకు మించి ఎంత సూపర్ హిట్ సినిమా అయినా థియేటర్స్ లో కనిపించడం లేదు. శుక్రవారం రావాల్సిందే.. కొత్త బొమ్మ పడాల్సిందే అన్నట్టు తయారైంది ఫిల్మ్ ఇండస్ట్రీ.

Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?

ఈ వారంలోనే కోట్ల కలెక్షన్లు, కళ్లు తిరిగే రికార్డులు సృష్టిస్తున్నారు మూవీ స్టార్స్. ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్, థర్డ్ అంటూ కేవలం రోజుల్లోనే కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఇప్పుడలానే మా సినిమా తోపంటే మా సినిమా అంటూ స్టార్స్ రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు ముఖ్యంగా తెలుగు సినిమా లెక్కలు ఇలా ఉండేవి కావు. ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే ఆ సినిమాకే సూపర్ డూపర్ హిట్ అని ట్యాగ్ లైన్ తగిలించేవారు. ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ అందరూ అలాంటి హిట్స్ ను ఎంజాయ్ చేసిన వాళ్లే. అంతేందుకు ఇప్పటి స్టార్స్ సినిమాలు సైతం ఒకప్పుడు వెయ్యికి పైగా రోజులు థియేటర్స్ లో హల్చల్ చేసాయి. పూరీ-మహేశ్ కాంబోలో వచ్చిన పోకిరి మూవీ థియేటర్ లలో వెయ్యి రోజులు నిలబడి స్టామినా ఏంటో చూపించింది.

Raai Laxmi: ఫోటో షూట్‌లతో రత్తాలు రచ్చ..!

ఇన్ని సెంటర్స్ లో ఇన్ని రోజులాడిందని చెప్పుకోవడం గతంలో గొప్ప. ఈ ఫార్ములాతోనే చిరూ, బాలయ్య, వెంకీ, నాగ్ చాలా హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, హిట్లర్, ఇంద్ర, ఠాగూర్.. ఒకటా, రెండా మెగాస్టార్ దక్కించుకున్న మెగా బ్లాసర్స్ ఎన్నో. ఇక కెరీర్లో ఇలాంటి బంపర్ హిట్స్ ఎన్నో చూసిన బాలకృష్ణ లెజెండ్ సినిమా ఏకంగా 1005 రోజులు కూడా ఆడి కొత్త రికార్డును సాధించింది. నాగ్, వెంకీ సైతం వాళ్ల హవా నడిపించారు. ఇప్పుడు కూడా కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్నారు కానీ ఎక్కువ రోజుల కాన్సెప్ట్ వర్క్ చేయలేకపోతున్నారు. అఖండ అయినా ఆచార్య అయినా, బంగార్రాజు కానీ.. వెంకీమామ కాని వారం, రెండు వారాల కలెక్షన్సే ఇప్పుడు కావాల్సింది.

Upasana: ప్రధాని మోడీతో ఉపాసన.. అసలు విషయం ఏమిటంటే?

రామ్ చరణ్ మగధీర వెయ్యికి పైగా రోజులు థియేటర్ లో కనిపించింది. తారక్ సింహాద్రి 145 సెంటర్లలలో 100 రోజులు ఆడింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి వస్తోన్న ట్రిపుల్ ఆర్.. రాజమౌళి ప్లానింగ్ తో రెండు వారాలను బీట్ చేయొచ్చు, లెక్కకు మించిన లెక్కలను చూపించొచ్చు కానీ కనీసం 50 రోజులు ఆడుతుందా అన్నది ప్రశ్నే. అంటే ఇదేదో నష్టం తీసుకొచ్చే సమస్యేం కాదు.. ఆడియెన్స్ టేస్ట్, సినిమా రికార్డ్స్ ఎలా మారింది అని చెప్తున్నది మాత్రమే.

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. అప్పుడు సినిమా రిలీజైన చాలా రోజులకి టీవీలో టెలికాస్ట్ జరిగేది. కాని ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ను కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ఛానల్స్ అన్ని రోజులు వెయిట్ చేయలేవు. లేటెస్ట్ ట్రెండ్ ఓటీటీ సైతం విండో గ్యాప్ లో సినిమాను స్ట్రీమింగ్ చేయాల్సిందే. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వచ్చేస్తోంది. అందుకే సినిమాకు ఎంత హైప్ తీసుకొచ్చామా… డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నామా… వారంలో కలెక్షన్స్ రాబట్టామా అన్నట్టు తయారయ్యారు మేకర్స్.