Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

ఆడియన్స్ తో అంత ఈజీగా కాదని రియలైజ్ అవుతున్నారు హీరోలు. స్టార్ కాస్ట్, బడ్జెట్, ఫారెన్ లొకేషన్స్, విజువల్ గ్రాండియర్ ఇలా ఎన్ని ఉన్నా.. ఎక్కడో లెక్కతప్పుతోంది. ఆ లెక్కల్ని మరోసారి..

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

Tollywood Big Movies

Tollywood Big Movies: ఆడియన్స్ తో అంత ఈజీగా కాదని రియలైజ్ అవుతున్నారు హీరోలు. స్టార్ కాస్ట్, బడ్జెట్, ఫారెన్ లొకేషన్స్, విజువల్ గ్రాండియర్ ఇలా ఎన్ని ఉన్నా.. ఎక్కడో లెక్కతప్పుతోంది. ఆ లెక్కల్ని మరోసారి సరి చూసుకుంటున్నారు మేకర్స్. ఇంకెలా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యాలా అని కిందా మీదా పడుతున్నారు.

Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!

రెగ్యులర్ సినిమాలైతే ఫాన్స్ కి అంతగా నచ్చడం లేదని, పెద్ద హీరోలతో ప్రయోగాలు చేశారా అంతే సంగతి. కొన్ని ఏదో వర్కవుట్ అయితే కొన్ని మాత్రం మిస్ ఫైర్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన క్రేజ్ తో వకీల్ సాబ్, భీమ్లానాయక్ బ్యాక్ టూ బ్యాక్స్ హిట్ కొట్టారు. అదేక్రేజ్ తో మరో 2 సినిమాల్ని కంప్లీట్ చెయ్యబోతున్నారు. అయితే వీటిలో హరీష్ శంకర్ తో చేస్తున్న ఒకటి రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ భవదీయుడు భగత్ సింగ్ అయితే.. మరొకటి క్రిష్ తో చేస్తున్న ఫోక్లోర్ మూవీ. బందిపోటు నాయకుడిగా హరిహరవీరమల్లుగా కొత్త లుక్ లో రెట్రో గెటప్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య ఇలాంటి సినిమాలు వచ్చినా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో వీరమల్లు పవర్ పెంచడానికి కసరత్తులు చేస్తున్నారు క్రిష్ అండ్ కో.

Tollywood Movies : దేశాలు దాటుతున్న సినిమాలు..

లాస్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అయ్యి పెద్ద సినిమాల రిలీజ్ కు లైన్ క్లియర్ చేసిన సినిమా పుష్ప. రిలీజ్ అయిన ప్రతిచోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాలీవుడ్ లో అయితే 100 కోట్ల కలెక్షన్లు సాధించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ స్టార్టవుతోంది. ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చి ఫస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పిన సుక్కు అండ్ కో.. ఇప్పుడు పుష్ప 2 కోసం ఆల్రెడీ రాసుకున్న స్టోరీని ఇంప్రువైజ్ చసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ ని మించి యాక్షన్, ఎమోషన్ డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించాలని జాగ్రత్త పడుతున్నారు.

Tollywood Big Movies : ఫైనల్ స్టేజ్‌లో పెద్ద సినిమాలు..

ప్రభాస్ అయితే రాధేశ్యామ్ దెబ్బకి తన్ అప్ కమింగ్ మూవీస్ అన్నింటినీ రీరైట్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది పోస్ట్ పోన్ చేసి జులైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇప్పుడు సినిమా రషెస్ చూసి.. ఈ లెక్కన సినమా గట్టెక్కడం కష్టమనుకుని.. ఇంకా ఇంటెన్స్ సీన్స్, నెక్ట్స్ లెవల్ యాక్షన్ ని ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ అయిన హొంబళే ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. 30 పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిన ఈమూవీ నెవర్ బిఫోర్ విజువల్స్ తో సర్ ప్రైజ్ చెయ్యడానికి నెక్ట్స్ ఇయర్ వరకూ టైమ్ తీసుకుంటోంది.

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

సలారే కాదు.. రాదేశ్యామ్ డిజాస్టర్ కి.. ఇంకాస్త జాగ్రత్త పడుతున్నారు ప్రభాస్. ఆల్రెడీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఒక పక్క డౌట్ కూడా పడుతున్నట్టు టాక్. ఇక నాగాశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కె లో ఇంకాస్త ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంతకముందు సినిమాల్లో ప్రభాస్ కి వర్కవుట్ కాని సీన్స్ కాకుండా ఈ పాన్ ఇండియా స్టార్ ని కొత్తగా చూపించడానికి తెగ కష్టపడుతున్నారు ప్రభాస్ డైరెక్టర్లు. అసలే పాన్ ఇండియా సినిమాలు.. ఆపై పాన్ ఇండియా స్టార్.. సినిమా దెబ్బేస్తే.. వందలకోట్లు నష్టపోవల్సి ఉంటుంది కాబట్టి ముందే జాగ్రత్త పడుతున్నారు.

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

మనం రాసుకున్న కథలైతే దెబ్బేసే ప్రమాదం ఉందని.. సేఫ్ సైడ్ గా సక్సెస్ అయిన రీమేక్ మూవీస్ చేస్తున్నారు ఈమధ్య మన స్టార్లు. అవికొన్ని వర్కవుట్ అయితే.. కొన్ని మాత్రం ఎందుకు ఫ్లాప్ అయ్యాయో కూడా తెలీక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి అలా రీమేక్ లతో వస్తున్నా.. అప్ కమింగ్ సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు మెగాస్టార్.