Tollywood Big Movies : ఫైనల్ స్టేజ్‌లో పెద్ద సినిమాలు..

అన్ లాక్ చేస్తే, ఏ సినిమాలు జెట్ స్పీడ్‌లో షూటింగ్స్‌కి వెళ్లనున్నాయి.. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌కి ఎంత షూట్ బ్యాలెన్స్ పెండింగ్‌లో ఉంది?..

Tollywood Big Movies : ఫైనల్ స్టేజ్‌లో పెద్ద సినిమాలు..

Tollywood Big Movies

Tollywood Big Movies: సెకండ్ వేవ్ లాక్ డౌన్‌తో షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గి.. అన్ లాక్ చేస్తే, ఏ సినిమాలు జెట్ స్పీడ్‌లో షూటింగ్స్‌కి వెళ్లనున్నాయి.. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌కి ఎంత షూట్ బ్యాలెన్స్ పెండింగ్‌లో ఉంది?..ఇప్పుడు చూద్దాం.

చిరు – చరణ్ కలయికలో రాబోతున్న ‘ఆచార్య’ మే 13న రిలీజ్ కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ మెగా ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. ఇంకా 10 నుంచి 12 రోజుల ‘ఆచార్య’ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. చిరంజీవి, చరణ్, సోనూసూద్ కాంబినేషన్స్ సీన్స్‌ను తెరకెక్కించాల్సి ఉంది కొరటాల శివ. అటు బాలయ్య బాబు ‘అఖండ’ కు ఇంకా వన్ మంత్ షెడ్యుల్ పెండింగ్‌లో ఉంది. బాలకృష్ణ, శ్రీకాంత్ కాంబినేషన్ సీన్స్‌తో పాటూ ‘అఖండ’ మేజర్ క్యారెక్టర్స్‌తో కొన్ని సన్నివేశాలను తీయాల్సిఉంది బోయపాటి శ్రీను.

అప్పుడు.. ఇప్పుడు రిలీజ్ అంటోన్న ఎప్పుడూ.. ‘రాధే శ్యామ్’ షూటింగ్ పెండింగ్‌లోనే ఉంటోంది. జూలై 30 నుంచి వాయిదాపడ్డ ‘రాధే శ్యామ్’ కోసం ప్రభాస్ ఇంకా వారం రోజులు షూటింగ్‌లో పాల్గొనాలి. కొన్ని రోజుల షూటింగ్‌తో వ్రాప్ అప్ చెప్పనున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. అయితే ఈ స్మాల్ షెడ్యూల్‌లోనే టీ సిరీస్ రిక్వెస్ట్ మేరకు ప్రభాస్, పూజాహెగ్డే లపై ఓ పాట తెరకెక్కించనున్నారు. ఈ సాంగ్‌తో పాటే ప్యాచప్ వర్క్ చేయనున్నారు. అంటే మొత్తంగా ‘రాధే శ్యామ్’ కోసం అటు ఇటు మరో 10రోజుల షూట్ బ్యాలెన్స్ ఉన్నట్టే.

ట్రిపుల్ ఆర్.. ఇప్పటి వరకైతే రిలీజ్ డేట్ అక్టోబర్ 13 నుంచి మార్చలేదు. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా నెల రోజులు చిత్రీకరణ జరపనున్నారు రాజమౌళి. ఓ మేజర్ ఫైట్ సీక్వెన్స్‌తో పాటూ ‘ఆర్ఆర్ఆర్’ ప్యాచప్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ చేస్తున్నారు నాని. హైదరాబాద్‌లోనే కోల్‌కతా సెట్ వేసి చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉంది. మొన్నటి వర్షానికి కాస్త దెబ్బతిన్నా.. అదే సెట్‌ రిపేర్ చేసి.. అక్కడే షూటింగ్ చేయనున్నారు మేకర్స్.

రెండు భాగాలుగా ‘పుష్ప’ రాబోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 1’ కోసం బన్నీ ఇంకా 10 రోజులు కష్టపడాల్సి ఉంది. చాలా చిన్న షెడ్యూల్‌లోనే రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు సుకుమార్. ఆ తర్వాత సెకండ్ పార్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక సంక్రాంతి రేస్‌లో ఉన్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. ఇంకా 80 శాతం షూట్ చేయాల్సిఉంది డైరెక్టర్ పరశురాం.

అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే.. నాగార్జున – ప్రవీణ్ సత్తారు మూవీకి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబో ‘థాంక్యూ’ మూవీ షూటింగ్ ఇంకా 50 పర్సెంట్ తెరకెక్కించాల్సిఉంది. ఇటలీ షెడ్యూల్‌ను ఈమధ్యే కంప్లీట్ చేశారు విక్రమ్. మరోవైపు ఎప్పటినుంచో వాయిదాలు పడుతోన్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ షూటింగ్ ఇంకా వారం రోజులు చేయాల్సిఉంది. ఓన్లీ ప్యాచప్ వర్క్ పూర్తి చేయనున్నారు అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్..