ENG-W vs IND-W : రెండో టీ20లో భారత్ ఓటమి..
ఇంగ్లాండ్తో శనివారం బ్రిస్టల్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో (ENG-W vs IND-W) భారత మహిళల జట్టు ఓడిపోయింది.
England Women won by 26 runs in 2nd T20 against India Women
- ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో ఓడిన భారత్
- మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం
ENG-W vs IND-W : ఇంగ్లాండ్తో శనివారం బ్రిస్టల్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతానికి 1-1తో సమమైంది. ఈ సిరీస్లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ టౌంటన్ వేదికగా జూన్ 2న జరగనుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫ్రెయా కెంప్ (39 నాటౌట్ ; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డానీ వైట్-హాడ్జ్ (29), అమీ జోన్స్ (28), ఆలిస్ క్యాప్సే (28) లు రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు వికెట్లు తీసింది. నందని శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ పడగొట్టారు.
Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
England win the 2nd T20I by 26 runs.
All to play for in the series decider in Taunton on Tuesday.
Scorecard ▶️ https://t.co/qaQTNLMyMq#TeamIndia | #ENGvIND pic.twitter.com/pBY3lm20j2
— BCCI Women (@BCCIWomen) May 30, 2026
అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (32; 25 బంతుల్లో 5 ఫోర్లు), యస్తిక భాటియా (33 రిటైర్డ్ ఔట్; 36 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్, షార్లెట్ డీన్, ఫ్రేయా కెంప్ లు తలా రెండు వికెట్లు తీశారు. సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ సాధించింది.
