Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!

స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అదిరిపోయే ఓటీటీ డీల్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాయి..

Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!

Tollywood Movies

Tollywood Movies: నారప్ప, టక్ జగదీష్, మ్యాస్ట్రో తర్వాత స్టార్ హీరోలతో పాటూ కాస్త పేరున్న హీరోలు కూడా డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సీటీమార్, లవ్ స్టోరీ ఇచ్చిన బూస్టప్‌తో మేకర్స్ అందరూ థియేటర్స్‌లో లక్ చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే ముందు హాళ్ల కొచ్చినా తర్వాత మాత్రం హోమ్ ఎంట్రీ ఏ హీరోకైనా తప్పదు. అందుకే థియేట్రికల్ రిలీజ్ ముందే అద్దిరిపోయే ఓటీటీ డీల్స్ వార్తల్లో నిలుస్తున్నాయి.

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

థియేటర్‌‌లోనే సినిమాలు.. కానీ ముందే ఓటీటీ డీల్స్. ఇప్పుడిలానే హాట్ హాట్ ఓటీటీ డీల్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌గా మారుతున్నాయి. దీని ప్రకారం మాక్సిమమ్ హీరోలెవ్వరూ డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వరు.. కానీ థియేటర్‌లో బొమ్మపడ్డ కొన్ని వారాలకు ఏ ఓటీటీలో వస్తామన్నది మాత్రం ముందే డీల్ చేసుకుంటారు. మంచి హైప్ ఉన్న సినిమాల కోసం కోట్లు కుమ్మరించి పోటీపడుతున్నాయి ఓటీటీ సంస్థలు. రీసెంట్‌గా భారీ రేట్‌కి మహా సముద్రం ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్, సిద్దార్ధ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత కొన్ని వారాలకు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుందని టాక్.

Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..

తెలుగు ఒరిజనల్ కంటెంట్‌తో వహ్వా అనిపిస్తోన్న ఆహా ఓటీటీ.. క్రేజీ సినిమాలను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. లక్ష్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ సినిమాలు ఆహా ఖాతాలో ఉన్నాయని అంటున్నారు. భారీ మొత్తంతో కొనేసిన ఈ లవబుల్ ప్రాజెక్ట్స్‌ను ఆహా థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ చేయనుంది. ఇక ఆల్రెడీ థియేటర్స్‌లో సందడి చేస్తోంది లవ్ స్టోరీ. దసరా ఫెస్టివల్ అక్టోబర్ 15వ తేదీన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఆడియెన్స్ ముందుకు రాబోతుండగా నాగశౌర్య లక్ష్య నవంబర్ 12 డేట్ ఫిక్స్ చేసుకుంది.

Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..

ఇప్పటికే వి, టక్ జగదీష్ సినిమాలతో ఓటీటీ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన నాని.. నెక్ట్స్ శ్యామ్ సింగ రాయ్‌ను మాత్రం థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని డిసైడయ్యాడు. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ డిజిటర్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు టాక్ నడుస్తోంది. కలకత్తా బ్యాక్ డ్రాప్‌తో బ్రిటీష్ కాలం నాటి వింటేజ్ డ్రామాగా ఈ మూవీని డిజైన్ చేస్తున్నారు. సో, ఈ సినిమా థియేటర్ ఎక్స్‌పీరియెన్సే ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. ఆ తర్వాత దాదాపు 8 కోట్లు పెట్టి శ్యామ్ సింగ రాయ్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ప్లిక్స్‌లో ఆడియెన్స్ ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.

Shyam SinghaRoy

థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ వేరు.. స్మార్ట్ స్క్రీన్ ఎంజాయ్‌మెంట్ వేరు. అందుకే ఆడియెన్స్‌కు పర్ఫెక్ట్ మీల్స్ అందించేందుకు హాల్‌కే ఓటేస్తున్నారు స్టార్స్. ముందు థియేటర్స్‌లో బొమ్మ పడ్డాకే కాచుకో ఓటీటీ అంటున్నారు. కానీ డిజిటల్ బేర సారాల్లో మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు.

Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?

రాధే శ్యామ్ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి గతంలోనే అమ్ముడు పోయాయనే బజ్ నడిచింది. దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాధే శ్యామ్.. ఆడియెన్స్‌కు సూపర్‌గా కనెక్ట్ కావాలంటే థియేటర్స్‌లోనే డార్లింగ్ బొమ్మ పడాలి. తర్వాత రిపీట్ మోడ్‌లో ఎంజాయ్ చేయాలంటే డిజిటల్ ఫ్లాట్‌ఫాం పైకి రావాలి. అందుకే రెండింటికీ న్యాయం చేస్తూ సంక్రాంతికి హాళ్ల కొచ్చాక.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ హిందీ హక్కులు తప్పించి మిగిలిన లాంగ్వేజ్ రైట్స్ జీ5 దగ్గర ఉన్నాయంటున్నారు.

Radhe Shyam : అవన్నీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

ఇండియా వైడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూవీ ట్రిపుల్ ఆర్. దసరా రేస్ నుంచి తప్పుకున్న ఈ మూవీ సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ ఇంత వరకు మరో డేట్‌ను లాక్ చేయలేదు రాజమౌళి. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇది వరకే భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. నెట్‌ఫ్లిక్స్ ట్రిపుల్ ఆర్ హిందీ డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. మిగిలిన భాషల హక్కులు జీ5 ఓటీటీ దగ్గరున్నాయి. అయితే ఎవరిదగ్గర ఎలాంటి రైట్స్ ఉన్నా.. ఏదైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాతే అన్న ట్యాగ్ లైన్ కూడా ఉంది.

 

Rrr

బాలయ్య – బోయపాటి లేటెస్ట్ ఫ్లిక్ అఖండ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకునే పనిలోనే ఉంది. గతంలో దసరా కొస్తానని బాలయ్య చెప్పాడు కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. ఇదిలాఉంటే అఖండ డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న థియేటర్స్‌కి రాబోతుంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో కేజీఎఫ్ చాప్టర్ 2 షో పడనుంది. ఇదివరకు చాప్టర్ 1 తో ఓటీటీలో దుమ్మురేపిన ప్రైమ్.. అంతే సక్సెస్‌ను చాప్టర్ 2తో కొల్లగొడతామనే ధీమాతో ఉంది.