Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

వరసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కదా.. ఏం తీసినా చూసేస్తారు అనే రోజులు పోయాయి. ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా.. ఎంత టాప్ డైరెక్టర్ అయినా..

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

Pan India Movies

Pan India Movies: వరసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కదా.. ఏం తీసినా చూసేస్తారు అనే రోజులు పోయాయి. ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా.. ఎంత టాప్ డైరెక్టర్ అయినా.. ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా.. ఏ రేంజ్ లో సినిమా తీసినా.. హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. సినిమా వర్కవుట్ అవుతుందన్న నమ్మకం లేదు. ఆడియన్స్ కి నచ్చేలా సినిమా తియ్యాలంటే ఎక్స్ ట్రార్డినరీ ఎలిమెంట్స్ కావాలి. ప్రేక్షకుడిని మెప్పించాలంటే ఇంకేవో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్న సినిమా లేంటో.. అసలు అప్ కమింగ్ బిగ్ మూవీస్ లో అలాంటివేం ఉన్నాయో చూద్దాం.

Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

ఆడియన్స్ టేస్ట్ రోజురోజుకీ మారిపోతోంది. సినిమాల విషయంలో ఎప్పటి కప్పుడు అప్ డేట్ అవ్వాల్సిందే అని ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ కి హింట్ ఇస్తూనే ఉన్నారు జనాలు. పెద్ద సినిమా అనో, తమ స్టార్ హీరో సినిమా అనో.. గుడ్డిగా సినిమాని హిట్ చేసే రోజులు పోయాయి. సినిమాలో సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటేనే కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. లేకపోతే.. ఎన్నివందల కోట్ల బడ్జెట్ తో తీసినా.. ఎంత పెద్ద స్టార్ హీరోలైనా అసలు పట్టించుకోవడం లేదు జనాలు.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

500 కోట్ల బడ్జెట్.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీ పెరిగిన టికెట్ రేట్స్ తో 250 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ సాధించినా.. సినిమా మాత్రం డివైడ్ టాక్ తోనే కంటిన్యూ అవుతోంది. రాజమౌళి రేంజ్ సినిమా కాదని, లాజిక్ లేని సినిమా అని, మిగతా క్యారెక్టర్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. అసలు తెలుగు తర్వాత ఎక్కువ కలెక్షన్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేసిన ట్రిపుల్ఆర్ మూవీ.. బాలీవుడ్ లో ఫస్ట్ డే జస్ట్ 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

ఆల్ఇండియా వైడ్ ఎన్ని ప్రమోషన్లుచేసినా.. ఎంత గ్రాండ్ గా సినమా తెరకెక్కించినా, పెద్ద స్టార్ కాస్ట్ ని పెట్టినా సినిమాని కనెక్ట్ చేసే ఎలిమెంట్ లేకపోతే.. సినిమా సక్సెస్ కాదనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ పాయింట్ మిస్ అయితే.. ఎలాంటి తోప్ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడాల్సిందే. దాదాపు మూడేళ్ల నుంచి సినిమా కోసం వెయిట్ చేసిన ప్రభాస్ ఫాన్స్.. 300 కోట్లతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ చూసి డిసప్పాయింట్ అయ్యారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ప్రతి చోటా ఫ్లాప్ టాక్ తోనే రన్ అయ్యింది రాధేశ్యామ్. ఈ మూవీతో పాటు సౌత్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన అజిత్ యాక్షన్ ఎంటర్ టైనర్ వలిమై ఆడియన్స్ పల్స్ పట్టుకోలేక డిజాస్టర్ అయ్యింది.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

సౌత్ సినిమాలేకాదు.. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీస్ ఎమోషనల్ క్రికెట్ డ్రామా 83, అక్షయ్ కుమార్ యాక్షన్ మూవీ బచ్చన్ పాండే అసలు మినిమం హిట్ ని కూడా అందుకోలేకపోయాయి. ఈ 2 సినిమాల్లో భారీ స్టార్ కాస్ట్, భారీ మేకింగ్,.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది. అందుకే అంతంత మాత్రం కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

సినిమా సక్సెస్ విషయంలో, జనాన్ని మెప్పించే విషయంలో పెద్ద సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వందలకోట్ల బడ్జెట్, టైమ్ తో పాటు చాలామంది ఫ్యూచర్ ఈ సినిమాల మీద డిపెండ్ అయి ఉంటుంది.. ఎంత పెద్ద సినిమా చేసినా అది ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందన్న కాన్సెప్ట్ తోనే చెయ్యాల్సి ఉంటుంది. అందుకే అప్ కమింగ్ పెద్ద సినమాలన్నీ ఆడియన్స్ ని ఎలా మెప్పించాలా అని తెగ టెన్షన్ పడుతున్నాయి.