Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

కొత్త సినిమా ముహూర్తాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇదిగో ముహూర్తం అదిగో షూటింగ్ అని చాలా కాలం నుంచి చెబుతున్న సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే పరిస్తితి కనిపించడం లేదు

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

Postpone Movies

Postpone Movies: కొత్త సినిమా ముహూర్తాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇదిగో ముహూర్తం అదిగో షూటింగ్ అని చాలా కాలం నుంచి చెబుతున్న సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే పరిస్తితి కనిపించడం లేదు. సినిమాలైతే వరసగా అనౌన్స్ చేశారు కానీ.. ఆ సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్ స్టార్ట్ చెయ్యలేక.. డిలే అవుతున్నాయి. పాత సినిమాల్ని యుద్ద ప్రాతిపదికన బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ చేసి మరీ కంప్లీట్ చేస్తున్నారు మన స్టార్లు. ఇంకేమంది కొత్త సినిమాల్ని సెట్స్ మీదకెక్కించడమే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అనుకున్నది అనుకున్నట్టు ఒక్క సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో చేద్దామనుకున్న సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. సర్కారు వారి పాట సినిమాతో ఫ్రీ అయిపోతున్న మహేష్ నెక్ట్స్ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేస్తారనుకున్నారు అందరూ. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కబోతున్న సినిమా స్టోరీ, మ్యూజికల్ సిట్టింగ్స్ తో ఆమధ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ స్పీడ్ గా జరుగుతుందని హింట్ ఇచ్చారు. మొన్నీమధ్య సినిమా ఓపెనింగ్ కూడా గ్రాండ్ గాచేశారు. ఇంకేమంది సినిమా వారం, 10 రోజుల్లో స్టార్టవుతుందనుకున్నారు. కానీ నెక్ట్స్ మన్త్ వెకేషన్ కి వెళుతున్న మహేష్.. ఇప్పుడప్పుడే సినిమా స్టార్ట్ చేసేచాన్స్ లేదు. నెక్ట్స్ మన్త్ వెకేషన్ తో పాటు మేలో సర్కారు వారి పాట రిలీజ్ ఉండడంతో ప్రమోషన్లు, రిలీజ్ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. ఇక త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యేది జూన్ లోనే అంటున్నారు జనాలు.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

పుష్పతో సూపర్ హిట్ కొట్టిన బన్నీ.. పుష్ప 2 సినిమాని అప్పుడే స్టార్ట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఫిబ్రవరి లాస్ట్ కి షూటింగ్ ఎట్టి పరిస్తితుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పిన డైరెక్టర్ అండ్ కో మార్చి అయిపోతున్నా ఇప్పటి వరకూ షూటింగ్ మీద ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. డైరెక్టర్ సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్ కి ఫారెన్ ట్రిప్ వెళ్లారు. అంతేకాదు.. ఇక సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఇప్పుడే షూటింగ్ వద్దని అనుకుంటున్నట్టు టాక్. ఫస్ట్ పార్ట్ బాలీవుడ్ లో కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో సెకండ్ పార్ట్ కి ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు టీమ్. దాంతో ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వాల్సి పుష్ప 2 మూవీ జూన్ లో స్టార్టయ్యే ఛాన్సుందంటోంది సుక్కు అండ్ కో.

Biopic Movies: డైరెక్షన్ లోపం.. స్టార్లతో సినిమా అంటే మజాకా?

ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కూడా నెక్ట్స్ మూవీ స్టార్ట్ చెయ్యడానికి ఎంత వెయిట్ చేస్తున్నారో.. ఆ సినిమా అంతగా వెనక్కి వెళుతోంది. కొరటాల శివ డైరెక్షన్లో రెండో సారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా స్టార్ట్ చేస్తున్నారని ఎప్పటికప్పుడు న్యూస్ వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకూ సినిమా పట్టాలెక్కలేదు. అంతేకాదు మరో రెండు రోజుల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినా కూడా మరో నెలరోజుల వరకూ ఎన్టీఆర్-కొరటాల సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కొరటాల, చిరంజీవి కాంబినేషన్లో చేస్తున్న ఆచార్య నెక్ట్స మన్త్ ఎండ్ కి రిలీజ్ కి రెడీ అవుతుండడంతో.. ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం లేనట్టే.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో మరో సినిమా అనౌన్స్ చేశారు. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ అవుతోంది.. సెట్స్ మీదకెళ్లబోతోంది.. పూనకాలు లోడింగ్ అంటూ ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు హరీష్ శంకర్. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్టయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. నెక్ట్స్ మన్త్ లో హరిహరవీరమల్లు షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్న పవన్.. ఈ హిస్టారికల్ మూవీ కంప్లీట్ చెయ్యడానికి టైమ్ పడుతుంది కాబట్టి భవదీయుడు బాగా లేటవుతాడంటున్నారు ఫాన్స్.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ట్రైలింగ్వల్ సినిమా ప్లాన్ చేసి 10 నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకూ సెట్స్ మీదకెళ్లలేదు ఈ సినిమా. ఏషియన్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. అదిగో.. ఇదిగో అంటూ 10 నెలలు టైమ్ అయిపోయింది కానీ.. సినిమా మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఇప్పటికే మరో సినిమాతో బిజీగా ఉన్న ధనుష్.. శేఖర్ తో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న దానిపైమాత్రం ఇంకా క్లారిటీ లేదు.

2022 Summer Movies: ఏప్రిల్ నెలపై కన్నేసిన క్రేజీ ప్రాజెక్ట్స్!

అనిల్, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీ కూడా వాయిదా పడుతూ వస్తోంది. బాలయ్యతో సినిమా చేస్తున్నాని అంటు అనిల్ రావిపూడి, అనిల్ తో ఈ సారి సినిమా వేరే లెవల్ ఉంటుందని బాలయ్య.. ఓపెన్ గానే చెబుతున్నా.. ఇంకా సినిమా మాత్రం సెట్స్ మీదకెళ్లలేదు. అఖండ సక్సెస్ తర్వాత గోపీచంద్ తో యాక్షన్ కి రెడీ అయ్యారు బాలకృష్ణ. అనిల్ కూడా ఎఫ్ 3 ఫినిషింగ్ వర్క్స్ తో బిజీగా ఉండడంతో సినిమా వాయిదా పడుతూ వస్తోది.

Sports Movies : ఆటే కథ.. ఆటే సినిమా.. గేమ్స్ తో బాక్సాఫీస్ లో గోల్ కొడుతున్నారు

బన్నీ.. వేణు శ్రీరామ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ఐకాన్ మూవీ కూడా రోజురోజుకీ వాయిదా పడుతూ వస్తోంది. వకీల్ సాబ్ హిట్ తో సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన వేణు శ్రీరామ్ తో ఆల్రెడీ స్టార్ట్ చేసిన మూవీ షూటింగ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. బన్నీ ఇప్పుడుఏ సినిమా చెయ్యాలన్నా పుష్ప 2 కంప్లీట్ చెయ్యాల్సి ఉంటుంది. సో మినిమం వన్ ఇయర్ వరకూ ఐకాన్ పోస్ట్ పోన్ అవ్వాల్సిందే.