2022 Summer Movies: ఏప్రిల్ నెలపై కన్నేసిన క్రేజీ ప్రాజెక్ట్స్!

2021 రేస్ నుంచి.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ ఒకే నెలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ నెలలోనే థియేటర్స్ కి వస్తామంటున్నాయి. ఇప్పుడు కుదరకపోతే అప్పుడు మాత్రం పక్కా అని..

2022 Summer Movies: ఏప్రిల్ నెలపై కన్నేసిన క్రేజీ ప్రాజెక్ట్స్!

2022 Summer Movies

2022 Summer Movies: 2021 రేస్ నుంచి.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ ఒకే నెలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ నెలలోనే థియేటర్స్ కి వస్తామంటున్నాయి. ఇప్పుడు కుదరకపోతే అప్పుడు మాత్రం పక్కా అని తేల్చేస్తున్నాయి. అయితే ఇన్ని పెద్ద సినిమాలు ఒకే నెలలో థియేటర్స్ కి రాగలవా.. వచ్చినా ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించగలవా అన్నదే ఆసక్తిగా కనిపిస్తుంది. ఏప్రిల్ నెలను టార్గెట్ చేస్తున్నారు సౌత్ టు నార్త్ స్టార్స్. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలన్నీ ఏప్రిల్ నెలలోనే దూకేందుకు రెడీ అవుతున్నాయి.

Senior Hero’s: రిటైర్మెంట్ టైమ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్న సీనియర్ స్టార్స్!

సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ సమ్మర్. అందులోనూ హాలీడేస్ కు ఫేమసైన ఏప్రిల్ కు ఎప్పుడూ గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు మిస్ అయిన మేకర్స్ అందరూ నెక్ట్స్ వచ్చేది ఏప్రిల్ కే అనేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు, కొవిడ్ ఆంక్షల నుంచి ఏప్రిల్ నెల వరకు రిలీఫ్ రావచ్చనే కారణమూ ఇందులో ఉండొచ్చు. నిజానికి ఏప్రిల్ నెలను ఫస్ట్ బుక్ చేసుకుంది పవర్ స్టార్ హరిహర వీరమల్లు, గ్లోబల్ స్టార్ సలార్ సినిమాలు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా హరిహర వీరమల్లు షూటింగ్ లేట్ అయింది. క్రిష్.. స్టోరీలో మార్పులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏప్రిల్ నెలను వదిలేసిన హరిహర వీరమల్లు.. జూలైకి ఫిక్సయ్యాడని టాక్. అటు ప్రభాస్ సలార్ ప్లేస్ ను కేజీఎఫ్2తో రీప్లేస్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ బదులు ఏప్రిల్ 14న థియేటర్స్ కి రాబోతుంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2.

Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

ఫిబ్రవరిలో వస్తుందనుకున్న ఆమీర్ లాల్ సింగ్ చద్దా.. ఏప్రిల్ 14కు షిఫ్ట్ అయింది. నాగచైతన్య కీ క్యారెక్టర్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆంధ్రలోనూ జరిగింది. అయితే ఆమీర్ ది సేమ్ ప్రాబ్లమ్. కొవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ బాగా లేటయింది. సో ఏప్రిల్ నెలకు మారక తప్పలేదు. హాలీవుడ్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో సల్మాన్ ఖాన్ సైతం చిన్న రోల్ ప్లే చేశాడు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై బాలీవుడ్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సంక్రాంతి రేస్ నుంచి ఫస్ట్ తప్పుకున్న స్టార్ మహేశ్ బాబు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాటను తీసుకొస్తానన్నారు. సర్జరీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ త్వరలోనే మళ్లీ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మిగిలిన షెడ్యూల్ పూర్తైతే పోస్ట్ ప్రొడక్షన్ ను చకచకా పూర్తి చేస్తాడు డైరెక్టర్ పరశురామ్. ఎట్టి పరిస్థితుల్లో సర్కారు వారి పాటను ఏప్రిల్ 1న తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్.

Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

రీసెంట్ గా ఏప్రిల్ నెలలోనే వస్తున్నానంటూ ప్రకటించాడు తమిళ్ స్టార్ విజయ్. ఈ హీరో సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోన్న బీస్ట్ సినిమాను ఏప్రిల్ నెలకే ఫిక్స్ చేశారు. న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ రిలీజ్ మ్యాటర్ రివీల్ చేశారు. నిజానికి సంక్రాంతికే రావాల్సింది విజయ్ బీస్ట్. కానీ అజిత్ వాలిమై పెద్ద పండక్కి వస్తాననడంతో విజయ్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఏప్రిల్ లో పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలిసీ ఏప్రిల్ లో రావడం ఖాయమంటున్నాడు. ఏప్రిల్ 29న మాచర్ల నియోజక వర్గం చూపిస్తానని నితిన్ ఇదివరకే చెప్పేశాడు. అయితే ఇప్పుడు సేమ్ డేట్ ఎఫ్3తో వస్తామని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. ఇవే కాదు.. అటు బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్ ధక్కడ్, మాధవన్ రాకేట్రి, టైగర్ ష్రాఫ్ హీరోపంటి2, అమితాబ్ – అజయ్ దేవగణ్ రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ గేమ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాయి.