Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

కొందరు బాలీవుడ్ మేధావులు టాలీవుడ్ ను తొక్కేయాలనుకుంటారు. బాహుబలి 2.. ఆ తర్వాత పుష్పతో పెరిగిన తెలుగు హీరోల క్రేజ్ అక్కడ కొంతమందికి నచ్చడం లేదు. అందుకే విషయం లేని బాలీవుడ్..

Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

Pan India Movies

Pan India Movies: కొందరు బాలీవుడ్ మేధావులు టాలీవుడ్ ను తొక్కేయాలనుకుంటారు. బాహుబలి 2.. ఆ తర్వాత పుష్పతో పెరిగిన తెలుగు హీరోల క్రేజ్ అక్కడ కొంతమందికి నచ్చడం లేదు. అందుకే విషయం లేని బాలీవుడ్ సినిమాలను పైకెత్తేస్తున్నారు. కానీ అన్నీ తెలిసిన ఆడియెన్స్ మాత్రం కంటెంట్ ఉన్న ఏ సినిమాలకైనా జై కొట్టేస్తున్నారు.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

పుష్ప తీసుకొచ్చిన హైప్ బాలీవుడ్ అపర మేధావుల్ని నిద్రపోనివ్వట్లేదు. బాహుబలి2 తర్వాత టాలీవుడ్ కొచ్చిన క్రేజ్.. ప్రభాస్ తో పాటూ పాన్ ఇండియా హీరోలుగా ఎదుగుతున్న తీరు.. కొందరికి అస్సలు నచ్చట్లేదు. నిజానికి అసలెలాంటి ప్రమోషన్స్ లేకుండా పుష్ప చేసిన సందడిని చాలామంది బాలీవుడ్ మేకర్స్ మెచ్చుకున్నారు. కానీ ఇదే కంటిన్యూ అయితే అసలుకే ఎసరొస్తుందనుకున్నారో ఎమో నెమ్మదిగా వర్షన్ మార్చేస్తున్నారు. అందుకే పనిగట్టుకుని విషయంలేని బాలీవుడ్ సినిమాలకు ఫ్రీగా పబ్లిసిటీ చేసిపెడతున్నారు.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

ట్రైలర్ తోనే పెద్దగా అట్రాక్ట్ చేయని బచ్చన్ పాండే మూవీకి అదుర్స్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు హై యాక్టివ్ బాలీవుడ్ క్రిటిక్స్. తీరా సినిమా థియేటర్స్ కొస్తే కానీ బచ్చన్ పాండే సంగతేంటో తెలిసింది. పూర్ కలెక్షన్స్ తో ఏమాత్రం పోస్ట్ రిలీజ్ బజ్ క్రియేట్ చేయలేకపోయింది బచ్చన్ పాండే. గతేడాది పుష్ప టైమ్ లో వచ్చిన 83ని సైతం అంతే ఆకాశానికెత్తేసారు. కానీ ఎంత ఎత్తిన బ్లాక్ బస్టర్ కాలేకపోయిన 83.. రీసెంట్గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి కూడా నెగిటివ్ రివ్యూస్ సంపాదిస్తుంది.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

అసలే సరైన కంటెంట్ లేని రాధేశ్యామ్ ను బాలీవుడ్ కి చెందిన కొందరు పూర్తిగా నెగెటివ్ చేసి పారేసారు. సోషల్ మీడియాలో రాధేశ్యామ్ మీమ్స్ చేసి వదిలారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తెలుగైనా, హిందీ అయినా.. ఏ లాంగ్వేజ్ అయినా సినిమాలో సరుకుంటే ఆడియెన్స్ అడగకపోయినా జై కొడుతున్నారు. అతి ఫ్యానిజం చూపించే వారిని వదిలిస్తే జెన్యూన్ ఆడియెన్స్.. ఏ హీరో ఎక్కడి హీరో మంచి సినిమా తీసుకొచ్చినా చూస్తున్నారు.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

పుష్ప తర్వాత బాలీవుడ్ హీరోలకెదురయ్యే ప్రశ్నలతో ఇరిటేట్ అయిపోతున్నారు. బచ్చన్ పాండే ప్రమోషన్స్ లో అక్షయ్ కుమార్ ను పుష్ప లాంటి మాస్ సినిమాలపై ఒపీనియన్ ఏంటని రిపోర్టర్ అడిగితే.. అందరి సినిమాలు ఆడుతాయని అక్షయ్ తప్పించుకున్నాడు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ తో క్లాష్, థియేటర్స్ విషయంలో జాన్ అబ్రహం స్పందించాడు. రాజమౌళి సినిమాలపై తనకు గౌరవం ఉందని.. కానీ తాను చేసిన సినిమాపై కూడా నమ్మకముందని.. మేము ఎవరికి నంబర్ 2 కాదని తేల్చేసాడు. సో మొత్తానికి తెలుగు పాన్ ఇండియా లెవెల్ ను కొందరు ఆహ్వానిస్తుంటే.. కొందరిని మాత్రం అది ఇబ్బంది పెడుతోంది.