రోహిత్, పంత్, గిల్, షా, సైనీలకు ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్

రోహిత్, పంత్, గిల్, షా, సైనీలకు ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్

Team India: రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు. మెల్‌బౌర్న్‌లోని ఇండోర్ రెస్టారెంట్ ఈ గ్రూప్ అంతా కలిసి తింటుండగా ఫొటో తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు ఇన్వెస్టిగేట్ కోసం వారందరినీ ఐసోలేషన్ లో ఉంచి.. మిగిలిన గ్రూపుకు ట్రైనింగ్ అనుమతి ఇచ్చారు.

క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఇరు బోర్డుల నుంచి యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ అతిక్రమించారా లేదా అనే విషయాన్ని మెడికల్ యూనిట్స్ ఇంకా కన్ఫామ్ చేయలేదని అధికారులు అంటున్నారు.

ఓ ఇండియా అభిమాని ట్విట్టర్ లో చేసిన పోస్టులో ఐదుగురు ఇండియన్లు ఒకే రెస్టారెంట్లో తింటున్నారు. తాను క్రికెటర్ల ఫుడ్‌కు డబ్బులు చెల్లించాలని.. అలా చేయగానే వెంటనే పంత్ తనను హగ్ చేసుకున్నాడని చెప్పాడు. కాకపోతే వెంటనే ఆ ట్వీట్ తొలగించాడు. ఆ తర్వాత పంత్ తనను హగ్ చేసుకోలేదని ఆతురతతోనే అలా కామెంట్ చేశానని తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు.

ఆస్ట్రేలియన్, ఇండియన్ మెడికల్ టీమ్స్ సలహా మేరకు ఆ గ్రూపు మొత్తాన్ని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రొటోకాల్స్ కు అనుగుణంగానే ప్లేయర్లను ట్రైనింగ్ కు అనుమతించారు. ఇటీవల బాక్సింగ్ డే టెస్టును విజయవంతంగా ముగించిన టీమిండియా మూడో టెస్టును జనవరి 7నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆడనుంది.