Telugu Films Shooting: నాన్ స్టాప్ షూటింగ్ లో సూపర్ స్టార్స్!

కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. దుబాయ్ లో నాగ్, రష్యాలో నాగచైతన్య..

Telugu Films Shooting: నాన్ స్టాప్ షూటింగ్ లో సూపర్ స్టార్స్!

Telugu Films Shooting

Telugu Films Shooting: కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. దుబాయ్ లో నాగ్, రష్యాలో నాగచైతన్య.. ఫిల్మ్ సిటీలో రామ్, ధనుశ్ ఇలా ఎక్కడివారక్కడ సెట్ అవుతున్నారు.. సెట్స్ పై బిజీగా మారారు.

Movie Releases: ఈసారి పక్కా.. డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోలు!

బంగార్రాజుతో సంక్రాంతి హిట్ కొట్టిన సోగ్గాళ్లు నెక్ట్స్ సినిమాల షూటింగ్స్ తో ఎవరికివాళ్లు బిజీగా మారిపోయారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున లీడ్ రోల్ చేస్తున్న సినిమా ది ఘోస్ట్. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. నాగ చైతన్య విక్రమ్ కుమార్ కాంబో మూవీ థాంక్యూ సినిమా రష్యాలో షూటింగ్ జరపుకుంటోంది. ప్రస్తుతం థాంక్యూ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉంది.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

కొవిడ్ పీక్ లో ఉన్నప్పుడు కూడా సెట్స్ మీద రఫ్ఫాడించారు మాస్ రాజా. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ సినిమా షూట్ శామీర్ పేటలో జరుగుతోంది. కల్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఛత్రపతి రీమేక్ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

రామ్ పోతినేని లింగు స్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న ది వారియర్.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మే నెలను రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ హై స్పీడ్ లో చేస్తున్నాడు రామ్. ధనుష్ నటిస్తున్న తెలుగు స్ట్రైయిట్ మూవీ సార్ షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది.