Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!

ఇక ఆగేదే లేదంటున్నారు బన్నీ, చరణ్, తారక్, మహేశ్ బాబు లాంటి స్టార్స్. కొవిడ్ తో వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడంతో పాటూ నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమాలు చేసేందుకు ఎవరి లెక్కలు...

Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!

Tollywood Star Hero's (2)

Tollywood Star Hero’s: ఇక ఆగేదే లేదంటున్నారు బన్నీ, చరణ్, తారక్, మహేశ్ బాబు లాంటి స్టార్స్. కొవిడ్ తో వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడంతో పాటూ నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమాలు చేసేందుకు ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. వన్స్ కొవిడ్ తగ్గి స్టార్స్ స్విఛ్ ఆన్ మోడ్ కి వస్తే.. సినిమా లైనప్ పెంచుకుంటూ పోవడమే కానీ తగ్గేదే లే అన్నట్టుంది పరిస్థితి. పైగా పాన్ ఇండియా ట్యాగ్ తో సెట్స్ పైకెళ్తున్న సినిమాలే అన్నీ.

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

ఇంకా 30రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సర్కారు వారి పాట.. త్వరలోనే కొత్త రిలీడ్ డేట్ ఫిక్స్ చేసుకోబోతుంది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ సెట్స్ కూడా మహేశ్ కోసం ఎదురుచూస్తున్నాయి. వన్స్ ప్రిన్స్ రంగంలోకి దిగితే బ్రేకులు లేకుండా వర్క్ చేయాలి. మహేశ్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్.. ఏప్రిల్ లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే టాక్ నడుస్తోంది. అంతా పాన్ ఇండియా బాట పట్టాక మహేశ్ సినిమాను అదే రేంజ్ లో త్రివిక్రమ్ ప్లాన్ చేసారు. తర్వాత రాజమౌళికి డేట్స్ ఇవ్వాలి. 2022 చివర్లో లేదంటే 2023 స్టార్టింగ్ లో జక్కన్న – మహేశ్ కాంబో సెట్స్ పైకెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈలోపు ముచ్చటగా మూడోసారి కొరటాల – మహేశ్ కలిసి వర్క్ చేయాలనే ఆలోచన కూడా ఉంది.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

ట్రిపుల్ ఆర్ చేస్తుండగానే.. ఆచార్యను కంప్లీట్ చేశారు రామ్ చరణ్. అదే టైమ్ లో శంకర్ సినిమాను పట్టాలెక్కించారు. శంకర్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే గౌతమ్ తిన్ననూరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. నెక్ట్స్ ప్రశాంత్ నీల్ కాంబోలో కూడా చెర్రీ మూవీ ఉండబోతుంది. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందే రంగస్థలం డబ్బింగ్ మూవీతో బాలీవుడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవబోతున్నారు చరణ్.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

ట్రిపుల్ ఆర్ టైమ్ లో వేరే మూవీ కమిట్మెంట్ పెట్టుకోలేదు ఎన్టీఆర్. ఫోకస్ మొత్తం జక్కన్న సినిమాపైనే ఫోకస్ చేసారు. ఇప్పుడు కొరటాల సినిమా స్టార్ట్ చేద్దామంటే కొవిడ్ మళ్లీ బ్రేక్ వేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతిత్వరలో కొరటాల – తారక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్స్ పైకెళ్తుంది. ఆపై తారక్… సేమ్ పాన్ ఇండియా లైన్ పట్టుకున్న బుచ్చిబాబుతో ఎంగేజ్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. అలాగే తారక్ లైన్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

పుష్ప పార్ట్ 1తో అల్టిమేట్ క్రేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్.. పుష్ప 2 కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ స్టోరీని రెడీ చేసిన బోయపాటితో వర్కవుట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ – లైకా ప్రొడక్షన్స్ కాంబోలో బన్నీ ఓ సూపర్ ప్రాజెక్ట్ కు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారనే చర్చ ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. వేణూ శ్రీరామ్ తో అనుకున్న ఐకాన్ అటకెక్కినట్టే అంటున్నారు.