UP : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో 1500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం

UP : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో 1500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం

UP Single Use Plastic Waste To Be Used For 1500 Km Road Construction : ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్.ఎక్కడ చూసినా వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. వీటితో పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోందని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా వాడకం మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు. కానీ వీటి వల్ల భూమికి హాని కలుగటంతో పలువురి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు, గోడలు నిర్మాణాలుచేస్తున్నారు.

ఈ క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 1500ల కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తిచేయాలనుకుంటోంది. దీనికి సంబంధించి ప్రజా పనులు విభాగం (పీడబ్ల్యూడీ)రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంచేసింది.

దీనికోసం 2వేల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించాలనుకుంటోంది. ఈ పనులు మొత్తాన్ని పీడబ్ల్యూడీ చూసుకోనుంది. ఈ ప్రాజెక్టు విషయంపై పీడబ్ల్యూడీ ప్రధాన కార్యదర్శి నితిన్ రమేష్ గోకర్న్ మాట్లాడుతూ..రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్ధాల వినియోగంపై ఎస్ ఓఆర్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైందని తెలిపారు.

గత ఏడాది పైలట్ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా 12 రోడ్ల నిర్మాణంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని..దీని ఫలితాలు సంతృప్తికంగా ఉండటంతో ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో 1500 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలనే ప్లాన్ కు పీడబ్ల్యూడీ అనుమతినిచ్చిందని తెలిపారు.

ప్రస్తుతానికి..పిడబ్ల్యుడి 94 కిలోమీటర్ల దూరంలో 75 రహదారుల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందనీ..మొత్తం 43 కిలోమీటర్ల పొడవున 32 రహదారులపై పనులు ప్రారంభించబడ్డాయన్నారు.

కాగా..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఇప్పటికే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రహదారులు నిర్మించబడ్డాయి. చిన్న ముక్కలు చేసే యంత్రాన్ని ఉపయోగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక నిర్దిష్ట పరిమాణానికి ముక్కలు చేయబడుతుంది.

అనంతరం ఆ ప్లాస్టిక్ వ్యర్థాల ముక్కలను కంకరను వేడి బిటుమెన్‌తో కలుపుతారు. అలా కలిపిన మిశ్రమాన్ని రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తారు. గత పదేళ్లలో..చెన్నై, పూణే, జంషెడ్‌పూర్,ఇండోర్‌లు ఒకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయవంతమైన ప్లాస్టిక్ వ్యర్ధాల రహదారులను నిర్మిస్తున్నాయి.