Dear Comrade : 250 మిలియన్ వ్యూస్‌తో రౌడీ హీరో రికార్డ్..

హిందీలో సత్తా చూపిస్తున్న విజయ్ దేవరకొండ, స్విమ్మింగ్‌లో సూపర్ అంటున్న సూపర్‌స్టార్ కొడుకు, బాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన నాగ చైతన్య మూవీ, బోల్డ్ లుక్‌లో సర్‌ప్రైజ్ చేసిన కియారా..

Dear Comrade : 250 మిలియన్ వ్యూస్‌తో రౌడీ హీరో రికార్డ్..

Dear Comrade

Dear Comrade: హిందీలో సత్తా చూపిస్తున్న విజయ్ దేవరకొండ, స్విమ్మింగ్‌లో సూపర్ అంటున్న సూపర్‌స్టార్ కొడుకు, బాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన నాగ చైతన్య మూవీ, బోల్డ్ లుక్‌లో సర్‌ప్రైజ్ చేసిన కియారా.. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్‌డేట్స్ బ్రీఫ్‌గా చూద్దాం.

సౌత్‌లో సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ హిందీలో కూడా తన హవా నడిపిస్తున్నాడు. ఆల్రెడీ కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో ‘లైగర్’ సినిమా చేస్తున్న విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ హిందీ డబ్బింగ్ మూవీ 25 కోట్ల వ్యూస్‌తో ఈ రౌడీ హీరో క్రేజ్‌ని ప్రూవ్ చేస్తోంది.

సూపర్‌స్టార్ పుత్రోత్సాహంతో వెలిగిపోతున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్.. తెలంగాణాలో తన ఏజ్ గ్రూప్ స్విమ్మర్లలో టాప్ స్విమ్మింగ్‌లో 8 ప్లేస్ దక్కించుకున్నాడు. దీనికి సంబంధించి గౌతమ్ వీడియోని పోస్ట్ చేసింది నమ్రత.

నాగ చైతన్య కూడా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. సమంత, నాగ చైతన్య జంటగా.. శివ నిర్వాణ డైరెక్షన్‌లో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 10 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది.

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సూపర్ సక్సెస్ సాధిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ. లేటెస్ట్‌గా డబూ రత్నానీ క్యాలెండర్ కోసం కియారా ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఈ క్యాలెండర్‌లో మరోసారి హాట్‌గా కనిపించింది కియారా.