MrIdiot Teaser : రవితేజ వారసుడు మాధవ్ “మిస్టర్ ఇడియ‌ట్‌” టీజర్ రిలీజ్

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌".

MrIdiot Teaser : రవితేజ వారసుడు మాధవ్ “మిస్టర్ ఇడియ‌ట్‌” టీజర్ రిలీజ్

Maadhav MrIdiot Teaser release now

Updated On : May 10, 2024 / 12:00 PM IST

MrIdiot : మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. పెళ్లి సందడి ఫేమ్‌ దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జెజే ఆర్ రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ర‌వితేజ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు.

ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య ( సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ల‌ను ఎంతో అద్భుతం గీస్తుంటుంది. కాలేజ్‌లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి స‌మ‌యంలో హీరో (మాధ‌వ్) కాలేజ్‌లోకి అడుగుపెడ‌తాడు. సత్యను గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్‌ను హీరో గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.

Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.