Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!

అందరి అంచనాల్ని మించి కెజిఎఫ్ 2 సూపర్ హిట్ అవడంతో అందరూ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అందులోనూ సలార్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుండడంతో.. అందరి దృష్టి సలార్ మీదే ఉంది.

Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!

Salaar

Salaar: అందరి అంచనాల్ని మించి కెజిఎఫ్ 2 సూపర్ హిట్ అవడంతో అందరూ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అందులోనూ సలార్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుండడంతో.. అందరి దృష్టి సలార్ మీదే ఉంది. కెజిఎఫ్ ని మించి ఎలా తెరకెక్కిస్తాడో, కెజిఎఫ్ ని మించి సలార్ లో ఇంకేం చూపిస్తాడో, అసలు సలార్.. కెజిఎఫ్ 3 యేనా.. అని రకరకాల డౌట్లతో రకరకాల ఎక్స్ పెక్టేషన్స్ తో హాట్ టాపిక్ అవుతోంది సలార్.

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ అప్‌డేట్ అప్పుడే!

ఆర్ఆర్ఆర్ అయిపోయింది. కెజిఎఫ్ 2 కూడా రిలీజ్ అయిపోయింది. ఇక మిగిలింది సలారే అంటున్నారు అందరూ. అందరి అంచనాల్ని అందులోనూ కెజిఎఫ్ లోనే నెవర్ బిఫోర్ యాక్షన్ ని ఎమోషన్ ని చూపించిన ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన సలార్ సినిమాలో ద మోస్ట్ వయెలెంట్ మ్యాన్ గా ప్రభాస్ ని చూపించబోతున్నారు. అదే ఎలా చూపించబోతున్నారు..? కెజిఎఫ్ లో ప్రశాంత్ నీల్ నెవర్ బిఫోర్ యాంగ్రీమెన్ ని చూపించారు.. అంతకంటే ఏ లెవల్ లో ప్రభాస్ ని పిక్చరైజ్ చెయ్యబోతున్నారో అంటూ ఇంట్రస్ట్ మొదలైంది ఆడియన్స్ లో.

Salaar: వచ్చే నెలలో సలార్ ట్రీట్.. రెడీ అవుతోన్న ఫ్యాన్స్!

కెజిఎఫ్ 2 లో యాక్షన్ కంటే నెక్ట్స్ లెవల్ యాక్షన్ ఉండేలా, అంతకుమించి ప్రభాస్ స్టేచర్ కి తగినట్టు ఎలివేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారని ఇప్పటికే అనౌనస్ చేసిన టీమ్.. అదేరేంజ్లో షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు 60 పర్సెంట్ కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన టీమ్.. ఇంటర్వెల్ సీన్ ని ఏకంగా 20 కోట్లతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ టీమ్ తో తెరకెక్కించారు.

Salaar: రెండు భాగాలుగా సలార్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

ప్రభాస్.. సలార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ రగ్డ్ లుక్ లో షార్ప్ మీసంతో ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తోంది. కెజిఎఫ్ 2కి సీక్వెలే సలార్ మూవీ అనే డిస్కషన్ హాట్ హాట్ గా జరుగుతోంది. సలార్ లో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు.. అదే కెజిఎఫ్ 2 లో యష్ ని అభిమానించే అబ్బాయి క్యారెక్టర్ కి రిలేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంతేకాదు అంతకుముందు ప్రశాంత్ నీల్ కూడా.. మార్వెల్, డీసీ కామిక్స్ లాగా క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ ఇష్టమని.. తనకంటూ ఓ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ క్రియేట్ చెయ్యాలని అనుకుంటున్నట్టు రివీల్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కెజిఎఫ్ 2, సలార్ ని కలిపేసి ఓ క్రేజీ కాన్సెప్ట్ ని రెడీ చేస్తున్నారని, రకరకాలుగా ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.