Salaar: వచ్చే నెలలో సలార్ ట్రీట్.. రెడీ అవుతోన్న ఫ్యాన్స్!

ప్రస్తుతం కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కేజీయఫ్ 2 చిత్రానికి.....

Salaar: వచ్చే నెలలో సలార్ ట్రీట్.. రెడీ అవుతోన్న ఫ్యాన్స్!

Salaar Teaser To Be Released In May Month

Salaar: ప్రస్తుతం కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కేజీయఫ్ 2 చిత్రానికి, రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా భారీ విజయం అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాను చూసేందుకు మాస్ ఆడియెన్స్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్ కూడా రెడీ అయ్యారు. అయితే ఎవరి ఊహకు అందకుండా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో సర్‌ప్రైజ్‌ను కూడా రెడీ చేసేశాడు.

KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మూవీ రివ్యూ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ మూవీగా ‘సలార్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇప్పటికే సగానికిపైగా ఈ సినిమా షూటింగ్ జరపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌నే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ప్రస్తుతం కేజీయఫ్ 2 మేనియాలో ఉన్న మాస్ ప్రేక్షకులకు.. రాధేశ్యామ్ డిజాస్టర్‌తో ఢీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కేజీయఫ్ 2 చిత్రంలో యశ్‌ను వయొలెంట్ మ్యాన్‌గా చూపించిన ప్రశాంత్ నీల్.. సలార్ చిత్రంలో ప్రభాస్‌ను ‘ది మోస్ట్ వయొలెంట్ మ్యాన్’‌గా చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తుండగా, అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Salaar: రెండు భాగాలుగా సలార్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

సలార్ చిత్ర టీజర్ గురించి తెలుసుకున్న కేజీయఫ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే ఈ సినిమాను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభాస్‌ను విధ్వంసకరమైన పాత్రలో మనకు సరికొత్తగా చూపించబోతున్నాడని కేజీయఫ్ 2 చిత్రాన్ని చూసిన ఆడియెన్స్ అంటున్నారు. హీరోలను ఎలివేషన్స్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో ప్రశాంత్ నీల్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకోవడంతో, ఆయన సలార్ చిత్రంలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.