Salaar: రెండు భాగాలుగా సలార్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది......

Salaar: రెండు భాగాలుగా సలార్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

Prashanth Neel Clarity On Salaar Two Parts

Salaar: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. గతంలో ఆయన తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్, పాన్ ఇండియా స్టార్’గా మారిపోయాడు. అయితే ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చాడు.

Salaar: సలార్ ‘ఒరిజినల్’ అంటోన్న డైరెక్టర్!

ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తుండగా, ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో గతకొంత కాలంగా ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. సలార్ చిత్రాన్ని కూడా కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమా కూడా ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా మారుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

అయితే తాజాగా సలార్ చిత్రంపై వస్తున్న వార్తలపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా ఏమీ తెరకెక్కించడంలేదని ఆయన అన్నారు. తాను రాసుకున్న కథ కేవలం సింగిల్ పార్ట్ వరకే ఉందని.. ఒకవేళ సెకండ్ పార్ట్‌కు సంబంధించి ఏదైనా ప్లాన్ ఉంటే ఖచ్చితంగా తామే చెబుతామని ప్రశాంత్ నీల్ అన్నారు. దీంతో సలార్ రెండు భాగాలుగా వస్తుందనే వార్తకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని.. ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలిపారు. అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.