Salaar: సలార్ ‘ఒరిజినల్’ అంటోన్న డైరెక్టర్!

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా...

Salaar: సలార్ ‘ఒరిజినల్’ అంటోన్న డైరెక్టర్!

Salaar

Salaar: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రశాంత్ నీల్, తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇప్పటికే ప్రారంభించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

అయితే గతకొంత కాలంగా సలార్ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ పుకారు జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’కు తెలుగు రీమేక్‌గా వస్తుందని పలు కథనాలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు సలార్ చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉండటంతో, ఈ వార్త నిజమే అని చాలా మంది అనుకున్నారు. కాగా తాజాగా కేజీఎఫ్ 2 చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, సలార్ రీమేక్ వార్తలపై స్పందించారు.

సలార్ సరికొత్త కథతో వస్తున్న సినిమా అని.. ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ కాదని ఆయన తేల్చి చెప్పారు. తన సినిమాల్లో ఉగ్రం చిత్రానికి సంబంధించిన ఛాయలు చాలావరకు ఉంటాయని.. కానీ సలార్ విషయంలో మాత్రం అలాంటిది ఏమీ లేదని.. ఇది ఒరిజినల్ మూవీగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఆయన అన్నారు. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

Prashant Neel: ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ ఢీల్!

అటు సలార్ చిత్రంలో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉండనుండగా, ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్, త్వరలోనే మళ్లీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి సలార్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.