Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ అప్‌డేట్ అప్పుడే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు....

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ అప్‌డేట్ అప్పుడే!

Salaar Teaser Update In Next Week

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా కథలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా రిజల్ట్‌తో ప్రభాస్ తన నెక్ట్స్ మూవీతో ఖచ్చితంగా బౌన్స్‌బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది మోస్ట్ వయొలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

Salaar: వచ్చే నెలలో సలార్ ట్రీట్.. రెడీ అవుతోన్న ఫ్యాన్స్!

ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్స్‌తో తీర్చిదిద్దుతున్నాడట ఈ డైరెక్టర్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో మనల్ని మెస్మరైజ్ చేసే స్టంట్స్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ టీజర్ రిలీజ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను వదిలేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Salaar: రెండు భాగాలుగా సలార్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సలార్ చిత్ర టీజర్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వచ్చే వారంలో ఇవ్వనున్నారట. దీంతో అభిమానలు ఈ అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రఫ్ అండ్ మాస్ లుక్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుండగా, ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీయఫ్’ను మించే ఎలివేషన్స్‌తో తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.