Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!

హీరోలే కాదు.. సోషల్ మీడియాలో టాప్ 10 ట్రెండ్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఉండడం మాత్రమే కాదు యంగ్ డైనమిక్ బ్యూటీస్ ను సీనియర్ హీరోయిన్స్ కూడా బీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!

Heroin's Social Media

Heroin’s Social Media:: హీరోలే కాదు.. సోషల్ మీడియాలో టాప్ 10 ట్రెండ్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఉండడం మాత్రమే కాదు యంగ్ డైనమిక్ బ్యూటీస్ ను సీనియర్ హీరోయిన్స్ కూడా బీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సమంతా.. ఇప్పుడీ స్టార్ ఏం చేసినా వైరల్ గా మారాల్సిందే. సోషల్ మీడియాలో ట్రెండ్ కావాల్సిందే. విడాకుల విషయం ఓ దుమారాన్ని సృష్టిస్తే.. ఆ చికాకులో నుంచి బయటపడేందుకు ఆమె వేసిన టూర్స్, చేసిన వర్కవుట్స్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ సామ్ ను సోషల్ మీడియా క్వీన్ ని చేసేసాయి.

Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

సామ్ తర్వాత కాజల్ సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రూమర్స్ ఆమెను ట్రెండ్ చేసాయి. దీంతో నాగ్ ఘోస్ట్ నుంచి, కమల్ ఇండియన్ 2 నుంచి తప్పుకుందనే వార్తలు బాగానే గింగిరాలు చుట్టాయి. ఆచార్యలాంటి సినిమాలు, హజ్బెండ్ తో హాట్ ఫోటోస్ కూడా కాజల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేలా చేసాయి. అసలు ఈ ఇయర్ ఒక్క సినిమా రిలీజ్ కానీ, సెట్స్ పై ఒక్క సినిమాని ఉంచని అనుష్క సోషల్ మీడియా క్వీన్స్ లిస్ట్ లో మూడో స్థానంలో ఉంది. అయితే తన 40వ బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటూ.. అనుష్క నెక్ట్స్ ఏం చేయబోతుంది, పెళ్లి చేసుకుంటుందా అన్న వార్తలే ఆమెను ట్రెండ్ చేసాయి.

Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

మాక్సిమమ్ స్టార్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటోన్న పూజా హెగ్డేది ఈ లిస్ట్ లో నాలుగో పొజిషన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, క్రేజీ సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తున్న బుట్టబొమ్మ త్వరలోనే నెంబర్ 1 ప్లేస్ కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తుంది. ఈ ఇయర్ వెబ్ సిరీస్ లతో అట్రాక్ట్ చేసిన తమన్నా సోషల్ మీడియా ట్రెండ్ సాగిస్తోన్న లిస్ట్ లో ఫిప్త్ ప్లేస్ కొట్టేసింది. అమ్మడి టైమ్ అయిపోయిందనుకుంటోన్న టైంలో క్రేజీ ఛాన్స్ లు కొట్టేస్తూ తన క్రేజీనెస్ చూపిస్తోంది తమన్నా.

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

ఇక పాజిటివ్ విషయాలతో ట్రెండ్ కొనసాగించే సాయిపల్లవిది ఆరో స్థానం. లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో పాటూ చిరూ చెల్లెలిగా చేసేందుకు నో చెప్పడం, నటిగా ఆమెకున్న స్టార్ డం వంటివి ఆమెను ట్రెండింగ్ లో ఉంచుతున్నాయి. స్టార్ సిస్టర్ గా పాపులరవుతున్న కీర్తి సురేశ్ కూడా మాక్సిమమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. సర్కారు వారి పాటతో పాటూ రజనీ, చిరూ సినిమాలు ఆమెను బాగా ట్రెండ్ చేసాయి. అందుకే ఏడో ప్లేస్ లో ఉంది కీర్తి.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

ఈ బ్యూటీ తర్వాతి ప్లేస్ లో రష్మిక మందన్నా ట్రెండ్ లో ఉంది. ఇక్కడ చేస్తున్నది రెండు సినిమాలే అయినా పేరు బాగా తెచ్చుకుంది రష్మికా. ఒక్క పుష్పనే ఆమె పాపులరాటీని అమాంతం పెంచేసింది. రష్మికా తర్వాతి స్థానాల్లో సోషల్ మీడియాను ఏలుతున్న హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నాలు. రకుల్ సినిమాలతో పాటూ ఫిట్ నెస్ వీడియోలతో అట్రాక్ట్ చేస్తుంటే… రాశిఖన్నా సైలెంట్ కిల్లర్ లా సినిమాలు చేస్తుండటమే ఆమెను హెడ్ లైన్స్ లో పెడుతోంది.